రెండు అదిరిపోయే బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ ను లాంచ్ చేసిన BSNL
దేశీయ టెలికాం రంగంలో పెను మార్పులు చోటు చేసుకోవడం ఆ మార్పులు బ్రాడ్ బ్యాండ్ వైపుకు వెళ్లడం శరవేగంగా జరిగిపోతోంది. అన్ని టెల్కోలు ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ వైపు దృష్టి సారించాయి.
దేశీయ టెలికాం రంగంలో పెను మార్పులు చోటు చేసుకోవడం ఆ మార్పులు బ్రాడ్ బ్యాండ్ వైపుకు వెళ్లడం శరవేగంగా జరిగిపోతోంది. అన్ని టెల్కోలు ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ వైపు దృష్టి సారించాయి.ఇందులో భాగంగానే రిలయన్స్ జియో తన బ్రాడ్‌బ్యాండ్ సేవలు విస్తరించేందుకు రెడీ అయింది. అయితే రిలయన్స్ జియో కీ పోటీగా BSNL నూతనంగా రెండు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.

తాజాగా రూ. 777 మరియు రూ. 1,277
తాజాగా రూ. 777 మరియు రూ. 1,277 నూతన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను BSNL లాంచ్ చేసింది. ఈ ప్లాన్స్ అన్ని సిర్కిల్స్ లో అందుబాటులో ఉన్నాయి.

రూ. 777 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
రూ.777 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో కస్టమర్లకు 500జీబీ డేటా లభిస్తుంది. దీనికి 30 రోజుల వాలిడిటీ ఉంటుంది. 500జీబీ ముగిసే వరకు ఇంటర్నెట్ స్పీడ్ గరిష్టంగా 100 ఎంబీపీఎస్ వరకు వస్తుంది. తరువాత స్పీడ్ తగ్గుతుంది. అప్పుడు కస్టమర్లకు కేవలం 2 ఎంబీపీఎస్ స్పీడ్ మాత్రమే వస్తుంది.
ఈ రూ.777 ప్లాన్ ను ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు సబ్ స్క్రైబ్ చేసుకునే వారికి BSNL బంపర్ ఆఫర్ ఇస్తుంది.ఒక సంవత్సరం సబ్ స్క్రైబ్ చేసుకునే వారు కేవలం 10 నెలలు గాను రూ.7,770 చెల్లిస్తే చాలు మిగతా రెండు నెలలు ఉచితంగా డేటా పొందవచ్చు. అలాగే రెండు సంవత్సరాలకు సబ్ స్క్రైబ్ చేసుకునే వారు కేవలం 20 నెలలు గాను రూ.14,763, చెల్లిస్తే చాలు మిగతా నాలుగు నెలలు ఉచితంగా డేటా పొందవచ్చు

రూ. 1,277 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
రూ.1,277 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో కస్టమర్లకు 750జీబీ డేటా లభిస్తుంది. దీనికి 30 రోజుల వాలిడిటీ ఉంటుంది. 750జీబీ ముగిసే వరకు ఇంటర్నెట్ స్పీడ్ గరిష్టంగా 100 ఎంబీపీఎస్ వరకు వస్తుంది. తరువాత స్పీడ్ తగ్గుతుంది. అప్పుడు కస్టమర్లకు కేవలం 2 ఎంబీపీఎస్ స్పీడ్ మాత్రమే వస్తుంది.
ఈ రూ.1,277 ప్లాన్ ను ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలకు సబ్ స్క్రైబ్ చేసుకునే వారికి BSNL బంపర్ ఆఫర్ ఇస్తుంది.ఒక సంవత్సరం సబ్ స్క్రైబ్ చేసుకునే వారు కేవలం 10 నెలలు గాను రూ.12,770 చెల్లిస్తే చాలు మిగతా రెండు నెలలు ఉచితంగా డేటా పొందవచ్చు. అలాగే రెండు సంవత్సరాలకు సబ్ స్క్రైబ్ చేసుకునే వారు కేవలం 20 నెలలు గాను రూ.24,263, చెల్లిస్తే చాలు మిగతా నాలుగు నెలలు ఉచితంగా డేటా పొందవచ్చు అలాగే రెండు సంవత్సరాలకు సబ్ స్క్రైబ్ చేసుకునే వారు కేవలం 30 నెలలు గాను రూ.35,756, చెల్లిస్తే చాలు మిగతా ఆరు నెలలు ఉచితంగా డేటా పొందవచ్చు


Click it and Unblock the Notifications








