తక్కువ ధరకే ఎక్కువ డేటా ఇస్తున్న BSNL
ప్రభుత్వ రంగ దిగ్గజం BSNL దేశీయంగా టాప్ లో ఉన్న టెలికాం దిగ్గజాలతో పోటీపడేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా సరికొత్త ఆఫర్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తోంది.
ప్రభుత్వ రంగ దిగ్గజం BSNL దేశీయంగా టాప్ లో ఉన్న టెలికాం దిగ్గజాలతో పోటీపడేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా సరికొత్త ఆఫర్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే అధిక డేటా ప్లాన్లను ప్రవేశపెట్టిన ఈ దిగ్గజం ఇప్పుడు యూజర్ల కోసం మరో సరికొత్త ప్లాన్ తో దూసుకువచ్చింది.ఇందులో భాగంగా రూ.78 ప్లాన్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.ఈ ప్లాన్ ను రీఛార్జి చేసుకున్న యూజర్ కు 2 జీబీ డేటా తో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.

రూ.78 ప్లాన్...
ఈ రూ.78 ప్లాన్ ను రీఛార్జి చేయించుకున్న యూజర్ కి 10 రోజుల పాటు రోజు కి 2జీబీ డేటా లభిస్తుంది.అంటే మొత్తంగా 20 జీబీ డేటాను యూజర్ పొందవచ్చు .దీంతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ రోజుకి 100 SMSలు లభిస్తాయి.

మరో సరికొత్త ప్లాన్..రీఛార్జ్ ప్లాన్లలో అధిక డేటా....
BSNL యూజర్ల కోసం మరో సరికొత్త ప్లాన్ తో దూసుకువచ్చింది. ఈ ఆఫర్లో భాగంగా యూజర్లు తమ రీఛార్జ్ ప్లాన్లలో అధిక డేటాను అంటే 2.2జిబి అడిషనల్ డేటాను పొందేందుకు వీలు కల్పిస్తోంది. ఈ ఆఫర్ నవంబర్ 14తో ముగిసిపోయిన నేపథ్యంలో కంపెనీ ఈ ఆఫర్ కున్న డిమాండును దృష్టిలో పెట్టుకుని దీన్ని మరింతకాలం పొడిగించింది.

ఆఫర్ విస్తరింపు...
ఈ ఆఫర్ నవంబర్ 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 2019 వరకు అందుబాటులో ఉంటుంది. పాత ఆఫర్ లో ఎలాంటి ప్రయోజనాలు యూజర్లు పొందుతున్నారో అవే ప్రయోజనాలను ఈ పొడిగింపు ఆఫర్లో కూడా పొందవచ్చు.

ఆఫర్ వర్తించే ప్లాన్లు...
అయితే ఈ ఆఫర్ కొన్ని ప్లాన్లకు మాత్రమే వర్తిస్తోంది. Rs. 186, Rs. 429, Rs. 485, Rs. 666 and Rs. 999తో యూజర్లు రీఛార్జ్ చేసుకుంటే అదనపు డేటా 2.2జిబిని యూజర్లు పొందుతారు. వీటతో పాటు ఎస్టీవి ప్యాక్స్ Rs. 187, Rs. 333, Rs. 349, Rs. 444 and Rs. 448లకు కూడా ఈ ఆఫర్ వరిస్తుంది.

STV 1699 and STV 2099 ప్లాన్లో ఉన్న వారికి...
STV 1699 and STV 2099 ప్లాన్లో ఉన్న వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. కాగా ఇవి 365 రోజుల వ్యాలిడితో ఉన్న ప్లాన్లు వీటికి కూడా ఇప్పుడు ప్రవేశపెట్టిన అదనపు డేటా వర్తిస్తుంది. కాగా రూ. 1699 ప్లాన్ ద్వారా యూజర్లు రోజుకు 2జిబి డేటా అలాగే రూ.2099 ద్వారా 4జిబి డేటాను 365 రోజుల పాటు పొందుతారనే విషయం విదితమే. కాగా అదనంగా యాడ్ అయిన డేటా ద్వారా యూజర్లు ఇకపై రోజుకు వరుసగా 4.21 జిబి డేటా ,6.21జిబి డేటాను పొందుతారు. మీరు BSNL సబ్ స్క్రైబర్ అయితే వెంటనే ఈ డేటా ప్లాన్లు యాక్టివేట్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








