BSNL బంపరాఫర్.. కేవలం రూ.99కే అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ 1.5GB డేటా..!
BSNL: ప్రైవేట్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) రీఛార్జ్ ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతూ రోజురోజుకూ రేట్లు పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL వైపు చూస్తున్నారు. తక్కువ ధరల్లో ఎక్కువ ప్రయోజనాలు అందించే ప్లాన్లతో BSNL దూసుకుపోతోంది. వినియోగదారులను ఆకర్షించడానికి BSNL సరికొత్త, అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. అవేవో చూద్దాం.
* BSNL రూ.99 ప్లాన్
BSNL తన వినియోగదారుల కోసం కొత్తగా రూ.99 రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌తో మీకు లభించే బెనిఫిట్స్ ఏవో చూద్దాం. ఈ ప్లాన్ కేవలం 17 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ, తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. మీరు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు.

లోకల్, ఎస్టీడీ అనే తేడా లేకుండా ఫ్రీగా మాట్లాడొచ్చు. రోజూ 100 ఉచిత SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా వస్తుంది. ఈ ప్లాన్‌లో ఉచితంగా పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ సర్వీస్ కూడా లభిస్తుంది. అంటే, నచ్చిన పాటను కాలర్ ట్యూన్‌గా పెట్టుకోవచ్చు. డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌కి ఇది బెస్ట్.
* BSNL రూ.147 ప్లాన్
BSNL మరో అదిరిపోయే ప్లాన్‌ను కూడా అందిస్తోంది. అదే రూ.147 రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. నెల మొత్తం వాడుకునే వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఉచిత SMSలు వస్తాయి.
ఈ ప్లాన్‌లో మీకు మొత్తం 10GB డేటా లభిస్తుంది. ఎక్కువ డేటా అవసరం లేని వారికి, నెల రోజులు వ్యాలిడిటీ కావాలనుకునేవారికి ఇది మంచి ప్లాన్. ఈ ప్లాన్‌లో ఉచిత కాలర్ ట్యూన్స్, పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ సర్వీస్ కూడా ఉంది. వీటితో కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా మెరుగుపడుతుంది.
* BSNL రూ.1999 ప్లాన్
ప్రతి నెలా రీఛార్జ్ చేసుకునే బాధ మీకు వద్దనుకుంటే, BSNL మీకు ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ చూపిస్తోంది. అదే రూ.1999 వార్షిక ప్లాన్. ఈ ప్లాన్ తీసుకుంటే, మీరు ఏకంగా 2026, మార్చి వరకు టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు. ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే చాలు.. ఏడాది మొత్తం కనెక్షన్ ఉంటుంది.
ఇండియాలో ఏ నంబర్‌కైనా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. లోకల్, ఎస్టీడీ అని ఏమీ లేదు. ఈ ప్లాన్‌లో మీకు ఏకంగా 600GB డేటా లభిస్తుంది. రోజువారీ లిమిట్ లేదు. కావాలంటే ఒకే రోజులో వాడుకోండి, లేదంటే ఏడాది మొత్తం వాడుకోవచ్చు. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో కనెక్ట్ అయి ఉండటానికి రోజుకు 100 SMSలు కూడా ఫ్రీగా వస్తాయి.
* ఎందుకంత మంది BSNLని ఎంచుకుంటున్నారు..
2024, జులైలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచేశాయి. కానీ BSNL మాత్రం తన ప్లాన్లను అందుబాటు ధరల్లోనే ఉంచింది. అందుకే, గత కొద్ది నెలల్లోనే 50 లక్షల మంది కొత్త కస్టమర్లను BSNL సంపాదించుకుంది. ఇప్పటికీ ఇండియాలో BSNL ఒక బెస్ట్ ఎకనామికల్ టెలికాం ఆప్షన్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications








