Home
News

BSNL 999 Plan వాలిడిటీ మరో నెల రోజులపాటు పెంపు

ఇండియా యొక్క టెలికాం రంగంలో భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) కాస్త వెనుకబడి ఉన్నప్పటికీ తన పూర్వ వైభవం పొందడానికి ఇప్పుడు కొత్త కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రెవేశపెడుతున్నది. వీటితో పాటుగా ముందు ఉన్న ప్లాన్‌లను సవరిస్తున్నది. ఇది ఇప్పుడు కొత్తగా 4G సేవలను కూడా ప్రారంభిస్తుండడంతో చందాదారులు అందరిని తమ వైపుకు ఆకట్టుకోవాలని చూస్తున్నది.

ప్రీపెయిడ్ ప్లాన్

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) రూ .299 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క చెల్లుబాటును ఇప్పుడు 240 రోజుల నుండి 270 రోజులకు పెంచింది. బిఎస్ఎన్ఎల్ నుండి వస్తున్న ఇతర చెల్లుబాటు పొడిగింపు ఆఫర్ల మాదిరిగానే ఇది కూడా ఫిబ్రవరి 15, 2020 నుండి మార్చి 31, 2020 పరిమిత కాలం వరకు మాత్రమే లభిస్తుంది.

 

 

బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని మాత్రమే అందిస్తుంది. ఇది ప్రస్తుతానికి చెన్నై & తమిళనాడు టెలికాం సర్కిల్‌లలో మాత్రమే చెల్లుతుంది. ఈ పరిమిత కాల ఆఫర్‌లో భాగంగా బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు అదనంగా 30 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. కొద్ది రోజుల క్రితం బిఎస్ఎన్ఎల్ రూ.1,188 మారుతం ప్లాన్‌పై ప్రమోషనల్ ఆఫర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రెండవసారి ధరల పెంపుపై చూస్తుండగా బిఎస్ఎన్ఎల్ మాత్రం ప్రమోషనల్ ప్రాతిపదికన తన యొక్క ప్లాన్‌ల వాలిడిటీని పెంచుతూనే ఉంది.

 

 

బిఎస్ఎన్ఎల్ రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ చెన్నై & తమిళనాడు సర్కిళ్లలో ఇప్పుడు రూ.999 వాయిస్-ఓన్లీ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఇది అందిస్తున్న ప్రయోజనాల విషయానికి వస్తే ఇది వినియోగదారులకు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా రోజుకు 250 నిమిషాల అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను 240 రోజుల వాలిడిటీ కాలానికి పొందుతారు. కానీ ఫిబ్రవరి 15 మరియు మార్చి 31 మధ్య రీఛార్జ్ చేసే వినియోగదారులకు 270 రోజులపాటు యాక్సిస్ లభిస్తుంది. రూ.999 ప్లాన్‌తో యూజర్లు ముంబై, డిల్లీ సర్కిల్‌ల కూడా వాయిస్ కాల్ చేయవచ్చు. ఈ ప్లాన్ రెండు నెలల పాటు బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ చందాతో వస్తుంది. బిఎస్ఎన్ఎల్ రూ.999 ప్లాన్‌తో డేటా మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాలను అందించడం లేదు.

 

 

బిఎస్ఎన్ఎల్ మారుతం ప్లాన్

బిఎస్ఎన్ఎల్ మారుతం ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.1,188 విలువ గల మారుతం ప్లాన్ కూడా కేవలం 5GB డేటా బెనిఫిట్ మరియు రోజుకు 250 నిమిషాల వాయిస్ కాలింగ్ ను 300 రోజులు అందిస్తుంది. మీరు కేవలం వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని ఇష్టపడే వారైతే అప్పుడు రూ.999 ప్లాన్‌ను ఎంచుకోండి. అలాగే బిఎస్‌ఎన్‌ఎల్ పనిచేస్తున్న అన్ని టెలికాం సర్కిల్‌లలో రూ .999 ప్లాన్ అందుబాటులో లేదని గమనించండి.

 

 

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,999 ప్లాన్ ఎక్సట్రా వాలిడిటీ

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.1,999 ప్లాన్ ఎక్సట్రా వాలిడిటీ

బిఎస్ఎన్ఎల్ రూ.1,999 వార్షిక ప్లాన్ను ప్రవేశపెట్టినప్పటి నుండి దానిపై ఎక్కువ దృష్టిని పెట్టింది. రిపబ్లిక్ డే 2020 సందర్భంగా ప్రవేశపెట్టిన కొత్త ఆఫర్‌లో భాగంగా బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ యూజర్లు రూ.1,999 రీఛార్జిపై 71 రోజుల అదనపు యాక్సిస్ ను పొందవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా ప్లాన్ యొక్క ప్రస్తుత వాలిడిటీ సమయం సాధారణ 365 రోజుల చెల్లుబాటు నుండి 436 రోజులకు పెరిగింది. BSNL ఈ ఆఫర్‌ను ఫిబ్రవరి 15, 2020 వరకు అందుబాటులోకి తెచ్చింది కాబట్టి మీరు BSNL నెట్‌వర్క్‌లో దీర్ఘకాలిక రీఛార్జ్ కోసం చూస్తున్నట్లయితే ఆఫర్‌ను పొందేలా చూసుకోండి.

 

 

BSNL 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లు

BSNL 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లు

బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు కొత్తగా రూ.96, రూ.236 ధరలతో రెండు 4G ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌లను విడుదల చేసింది. ఈ ప్లాన్‌ల యొక్క ప్రయోజనాలు బిఎస్ఎన్ఎల్ ఆపరేటర్ చందాదారులకు 4G సేవలను అందించే సర్కిల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కంపెనీ తన 4G సేవలను ప్రస్తుతం కోల్‌కతాలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభించింది. ఈ సేవను ఉపయోగించడానికి చందాదారులు రెండు ప్లాన్లలో దేనినైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లు ఖచ్చితంగా ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో కంటే మెరుగైన ప్రయోజనాలను అందిస్తాయి.

 

 

5GB డైలీ డేటాతో BSNL ప్రీపెయిడ్ ప్లాన్

5GB డైలీ డేటాతో BSNL ప్రీపెయిడ్ ప్లాన్

అధిక మొత్తంలో భారీగా డేటాను వినియోగించే వినియోగదారుల కోసం బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో గల మొదటి ప్రీపెయిడ్ ప్లాన్ PRBSTV రూ.548. ఇది దీని పేరుకు తగ్గట్లుగానే ఈ ప్లాన్ బిఎస్‌ఎన్‌ఎల్ నుండి వస్తున్న స్పెషల్ టారిఫ్ వోచర్ (STV) ఇది 548 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. ఈ STV ప్లాన్ యొక్క చెల్లుబాటు 90 రోజులు. ఈ ప్లాన్ రోజుకు 5 జిబి డేటాను అందిస్తుంది. ప్రతి రోజు 5GB డేటా అయిపోయిన తరువాత దాని యొక్క స్పీడ్ 80 Kbps కి తగ్గుతుంది. అయితే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఎటువంటి కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనంతో రాదని చందాదారులు గమనించాలి.

 

 

రోజుకు 3GB డేటాతో బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్

రోజుకు 3GB డేటాతో బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ప్రీపెయిడ్ ప్లాన్లలో రోజుకు 3 జిబి డేటాను అందించే ప్లాన్లు కూడా ఉన్నాయి. అయితే పైన పేర్కొన్న ప్లాన్‌లతో పోలిస్తే ఈ ప్లాన్ కేవలం 8 రోజుల పరిమిత చెల్లుబాటుతో వస్తుంది. ఈ చెల్లుబాటు వ్యవధిలో బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.78 STV డేటా ప్లాన్ చందాదారులు రోజుకు 3 జిబి డేటాను అందిస్తుంది. ఈ డేటా అయిపోయన తరువాత దీని యొక్క డేటా వేగం 40Kbps కు తగ్గించబడుతుంది. ఇందులో రోజుకు 250 నిమిషాల వాయిస్ కాలింగ్ ప్రయోజనం కూడా ఉంటుంది. అదనపు ప్రయోజనాలలో 250 నిమిషాల వాయిస్ కాలింగ్‌తో పాటు ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 250 నిమిషాల వీడియో కాలింగ్ కూడా లభిస్తుంది. వీటన్నిటితో పాటు ఈ ప్లాన్ EROS NOW ఎంటర్టైన్మెంట్ సర్వీసును కూడా అందిస్తుంది.

 

 

Best Mobiles in India

English summary
BSNL Prepaid Plans Details in Telugu: 4G Data Plans, Long term Plans, 3GB/5GB Data Plans
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X