Just In
- 9 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 11 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 14 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 16 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
దుమ్మురేపిన BSNL, ఏడాది పాటు 1 జిబి డేటా, అపరిమిత కాల్స్
టెలికాం రంగంలో నెలకొన్న తీవ్ర పోటీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్రీ పెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. రూ.999కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.999తో రీచార్జ్ చేసుకుంటే ఒక ఏడాది పాటు రోజుకు ఒక జీబీ డేటా, ఆరు నెలల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ వినియోగించుకోవచ్చు. డేటా పరిమితి దాటిన తర్వాత 40 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వస్తుంది. ఇక ప్రతిరోజూ 100 ఎస్సెమెస్‌లు ఉచితంగా లభిస్తాయి. జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య భారత రాష్ట్రాల్లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ కస్టమర్లకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1జీబీ చొప్పున ఏడాదిపాటు మొత్తం 365 జీబీ డేటా ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. ఇక ఇదే ప్లాన్ జియో, ఎయిర్‌టెల్‌లలో లభిస్తుండగా, వాటికి 60జీబీ డేటాను 90 రోజుల వాలిడిటీతో మాత్రమే అందిస్తున్నారు.
84 రోజుల పాటు లభించే బెస్ట్ ప్లాన్లు ఇవే.

రూ. 399 ప్లాన్
ఇంతకు ముందు దీని వ్యాలిడిటీ 70 రోజుల వ్యాలిడిటీతో ఉంది. కాగా దీన్ని ఇప్పుడు 84 రోజుల వరకు వ్యాలిడిటీని ఇచ్చింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 84 రోజుల పాటు రోజుకు 1జిబి 3జి/4జి డేటాను పొందుతారు. అలాగే అపరిమిత లోకల్ , నేషనల్ కాల్స్ లభిస్తాయి. డైలీ 100 ఎసెమ్మెస్ లు ఉచితంగా లభిస్తాయి.

Bsnl Rs 1099 plan
84 రోజులకుగాను రోజువారీ పరిమితి లేకుండా అన్‌లిమిటెడ్ డేటా అందించే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.1099తో రీచార్జ్ చేసుకుంటే.. 84 రోజుల పాటు అన్‌లిమిటెడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు, పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్‌కు ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నది. ఇది రోజువారి లెక్కన చూస్తే రోజుకు రూ.13తో అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్ ఇస్తున్నట్లుగా చెప్పవచ్చు. కాగా ఇండియాలోని అన్ని బీఎస్‌ఎన్‌ఎల్ సర్కిల్స్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

జియో ప్రీ పెయిడ్ ప్లాన్లు
రూ. 9,999
360 రోజుల పాటు 750 జిబి డేటా రోజుకు ఎటువంటి పరిమితి లేదు. ఉచిత కాల్స్ అందుబాటులో ఉంటాయి.
రూ. 4,999
360 రోజుల పాటు 350 జిబి డేటా రోజుకు ఎటువంటి పరిమితి లేదు. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు
రూ. 1,999
180 రోజుల పాటు 125 జిబి డేటా రోజుకు ఎటువంటి పరిమితి లేదు. అన్ లిమిటెడ్ కాల్స్.
రూ. 999
90 రోజుల పాటు 60 జిబి డేటా రోజుకు ఎటువంటి పరిమితి లేదు. అన్ లిమిటెడ్ కాల్స్.
రూ. 799
28 రోజుల పాటు రోజుకు 3 జిబి డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.
రూ. 509
49 రోజుల పాటు రోజుకు2 జిబి డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.

వొడాఫోన్ ప్లాన్ రూ.399
వొడాఫోన్ ప్లాన్ రూ.399 కింద నెలకు 30జీబీ 3జీ/4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. డేటాతో పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, నేషనల్ రోమింగ్, 100 ఎస్‌ఎంఎస్‌లు కస్టమర్లకు లభించనున్నాయి. వొడాఫోన్ ప్లే సర్వీసు ద్వారా రూ.4000 విలువైన మూవీలకు ఉచిత యాక్సస్ లభించనుంది. నాలుగు నెలల పాటు 3500 ఈ-మ్యాగజైన్లను చదువుకునేలా మ్యాగ్‌జటర్ సబ్‌స్క్రిప్షన్‌ను వొడాఫోన్ ఆఫర్ చేయనుంది. ఇతర ప్లాన్స్ మాదిరిగానే కొత్త రూ.399 వొడాఫోన్ రెడ్‌ప్లాన్ అపరిమిత కాల్స్‌లో రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే మాట్లాడుకోవాలి.

వొడాఫోన్ రూ. 352
ప్లాన్ రోజుకి 1జీబీ హైస్పీడ్ 4జీ డాటాను 84 రోజులపాటు అందించడానికి వొడాఫోన్ రూ. 352 ప్లాన్‌ను తీసుకొచ్చింది. డాటాతో పాటు ఉచిత రోమింగ్, అపరిమిత కాల్స్ కూడా అందిస్తోంది. ఎయిర్‌టెల్ ప్లాన్‌లో లేని అపరిమిత మెసేజ్ ఆఫర్ ఈ వొడాఫోన్ ప్లాన్‌లో ఉంది.

ఐడియా నిర్వానా ప్లాన్లు
రూ.389 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్..
అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్, ఉచిత ఇన్‌కమింగ్ రోమింగ్ కాల్స్, 10 జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, మూవీలు, గేమ్స్, మ్యూజిక్‌కు 12 నెలల వరకు ఉచిత సబ్‌స్క్రిప్షన్
రూ.499 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్..
అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్, ఉచిత ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ రోమింగ్ కాల్స్, 20 జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్
రూ.649 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్..
అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్, నేషనల్ రోమింగ్‌పై ఉచిత ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్, నెలంతా 35 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్
రూ.999 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్..
అపరిమిత కాలింగ్, నేషనల్ రోమింగ్‌పై ఉచిత ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్, నెలంతా 60 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్

ఐడియా నిర్వానా ప్లాన్లు
రూ.1,299 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్..
అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్ కాల్స్, ఉచితంగా 100 ఇంటర్నేషనల్ కాలింగ్ నిమిషాలు, నెలంతా 85 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్
రూ.1,699 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్..
అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్, ఉచిత ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ రోమింగ్ కాల్స్, 110జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్
రూ.1,999 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్..
అపరిమిత కాలింగ్, నేషనల్ రోమింగ్‌పై ఉచిత ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్, ఉచితంగా 200 ఇంటర్నేషనల్ నిమిషాలు, నెలంతా 135జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్
రూ.2,999 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్..
అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్ కాల్స్, ఉచితంగా 200 ఇంటర్నేషనల్ నిమిషాలు, నెలంతా 220జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470