Home
News

షాకింగ్‌ నిర్ణయాలు తీసుకుంటున్న BSNL.. ధరలు పెంచమని చెప్పినా..!

భారత్ మార్కెట్‌ లో గత సంవత్సరం ఎయిర్‌టెల్‌, జియో, వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచాయి. ఈ సంవత్సరం చివర్లోనూ మరోసారి ధరలు పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్‌ లో టారిఫ్‌ల పెంపు ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు జియో, ఎయిర్‌టెల్‌ సంస్థలు ARPU (వినియోగదారుని నుంచి వచ్చే సగటు ఆదాయం) పెంచుకొనేందుకు ఇటీవలే రోజువారీ 1GB డేటాను అందించే రీఛార్జ్‌ ప్లాన్‌ లను తొలగించాయి.

ఎయిర్‌టెల్‌ ఇటీవలే నెలవారీ కనీస రీఛార్జ్‌ ప్లాన్‌ రూ.189 ను కూడా తొలగించింది. ఫలితంగా నెలవారీ ప్లాన్‌ కోసం రూ.199 ను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే గత సంవత్సరం ప్రైవేటు టెలికాం సంస్థలు రీఛార్జ్‌ ప్లాన్‌ల ధరలు పెంచినా, BSNL (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్) మాత్రమే ధరలను పెంచబోమని ప్రకటన చేసింది. కానీ ప్రస్తుతం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

BSNL Rs107  Rs897 Recharge Plans

కీలక నిర్ణయాలు! :
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ అయిన BSNL ఇటీవల కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రీఛార్జ్‌ ప్లాన్‌ల ధరల్లో ఎటువంటి మార్పులు చేయకుండా.. వ్యాలిడిటీ సహా ఇతర ప్రయోజనాల్లో కోత విధిస్తోంది. ఇటీవల అనేక ప్లాన్‌ లో మార్పులు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. తాజాగా మరో రెండు ప్లాన్‌ల వ్యాలిడిటీని తగ్గించింది.

రూ.107 రీఛార్జ్ ప్లాన్‌ :
బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.107 రీఛార్జ్ ప్లాన్‌ లో తాజాగా కీలక మార్పులు చేసింది. తొలుత ఈ ప్లా్న్‌ వ్యాలిడిటీ 35 రోజులుగా ఉండేది. అనంతరం వ్యాలిడిటీని 30 రోజులకు తగ్గించించింది. ఆ తర్వాత మరోసారి వ్యాలిడిటీతో కోత విధించింది. అంటే 28 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందించింది.

అయితే తాజాగా ఈ వ్యాలిడిటీని 22 రోజులకు తగ్గించింది. ప్రస్తుతం ఈ ప్లాన్‌ లో 200 నిమిషాల లోకల్‌, STD కాల్స్‌ ను అందిస్తుంది. దీంతోపాటు 3GB డేటాను కూడా ఉపయోగించుకొనేందుకు అవకాశం ఉంది. అయితే ఎటువంటి SMS ప్రయోజనాలను అందిస్తోంది.

రూ.897 రీఛార్జ్‌ ప్లాన్‌ :
బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కలిగిన మరో ప్లాన్‌ ప్రయోజనాల్లో కోత విధించింది. రూ.897 రీఛార్జ్‌ ప్లాన్‌ లో గతంలో 180 రోజుల వ్యాలిడిటీని అందించేది. అయితే ప్రస్తుతం ఈ ప్లాన్‌ 165 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.897 ప్లాన్‌ లో భాగంగా గతంలో 90GB డేటాను వినియోగించుకొనే అవకాశం ఉండగా... తాజాగా డేటాలో భారీగా కోత విధించి కేవలం 24GB డేటాను మాత్రమే అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాన్‌ లో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను కూడా ఉపయోగించుకోవచ్చు.

వీటితోపాటు ఇటీవలే అనేక ప్లాన్‌ లో మార్పులు చేసింది. ఈ జాబితాలో రూ.147, రూ.197, రూ.319, రూ.439, రూ.599, రూ.1499 వంటి రీఛార్జ్‌ ప్లాన్‌ లు ఉన్నాయి. ఈ ప్లా్న్‌ ప్రయోజనాలతోపాటు వ్యాలిడిటీలోనూ కోత విధించింది. ఆదాయం పెంచుకోవడంలో భాగం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Rs107, Rs897 Recharge Plans validity and benefits reduced, full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X