Home
News

BSNL రూ.1198 రీఛార్జ్‌ ప్లాన్‌తో ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీ.. కాలింగ్‌, డేటా ప్రయోజనాల వివరాలు..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL.. ఇతర పైవేటు టెలికాం సంస్థలతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకే రీఛార్జ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతోపాటు ఇటీవల జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్-ఐడియా వంటి సంస్థలు మొబైల్ టారిఫ్‌ ధరలను పెంచడంతో ఎక్కువ మంది యూజర్లు BSNL వైపు మొగ్గు చూపుతున్నాయి. మరియు 4G నెట్‌వర్క్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండడంతో ఇతర నెట్‌వర్క్‌ల నుంచి పోర్టింగ్‌ అయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. ఇటీవల TRAI (ట్రాయ్ -టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఇందుకు సంబంధించిన నివేదిక వెల్లడించింది.

తాజాగా 365 రోజుల వ్యాలిడిటీతో BSNL అద్భుతమైన ప్లాన్‌ను (BSNL RS1198 Prepaid Recharge Plan) అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా సంవత్సర కాలంపాటు వ్యాలిడిటీతోపాటు కాలింగ్‌, SMS, డేటా ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న అన్ని నెట్‌వర్క్‌లలో BSNL మాత్రమే ఇంత తక్కువ ధరకు 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.

BSNL RS1198 Prepaid Recharge Plan

BSNL ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ రూ.1198 ద్వారా 365 రోజుల (12 నెలలు) వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతి నెల 3GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు ప్రతి నెల 300 నిమిషాల పాటు కాలింగ్‌, 30 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌ రోజువారీ ఖర్చు పరంగా చూస్తే రూ. 3.28 గా ఉంది. 365 రోజుల కాలంలో 36GB డేటాను మొత్తంగా వినియోగించుకోవచ్చు.

కాలింగ్‌, డేటా ను పరిమిత అవసరాల కోసం వినియోగించే BSNL యూజర్లకు ఈ ప్లాన్‌ బాగా ఉపయోగపడుతుంది. మరియు ఇతర ప్రైవేటు టెలికాం సర్వీసు ప్రొవైడర్లతో పోలిస్తే BSNL అత్యంత తక్కువ ధరకే 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. అయితే BSNL ప్రొమోషనల్‌ ఆఫర్‌లో భాగంగా ఈ నెల 24వ తేదీలోపల రీఛార్జ్‌ చేసుకుంటే అదనంగా 24GB డేటాను పొందవచ్చు. ఈ అదనపు డేటా 24 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.

* దీంతోపాటు BSNL ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ రూ.1515 ద్వారా 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. అంటే ప్లాన్‌ వ్యాలిడిటీ మొత్తంలో 730GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఈనెల 24 తేదీలోపల రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 24GB డేటాను పొందవచ్చు. 24 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.

దీంతోపాటు రూ.1999 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా 600GB ను పొందవచ్చు. ఈ డేటాపై రోజువారీ ఎటువంటి పరిమితి లేదు.

ఈ ప్లాన్‌లో భాగంగా ఈనెల 24 వ తేదీలోపల రీఛార్జ్‌ చేసుకుంటే అదనంగా 24GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వ్యాలిడిటీ 24 రోజులపాటు ఉంటుంది. బీఎస్‌ఎస్‌ఎల్‌ వార్షికోత్సవం సందర్భంగా ఈ అదనపు డేటాను అందిస్తోంది. అక్టోబర్ 1 నుంచి ఈ ప్రొమోషనల్‌ ఆఫర్‌ ను అందిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL RS1198 Prepaid Recharge Plan offers 365 Days validity with calling and Data benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X