BSNL అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్.. ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీ సహా..!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) యూజర్లను ఆకట్టుకొనేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా 97 వేలకు పైగా 4G నెట్‌వర్క్ టవర్లను ప్రారంభించింది. దీంతోపాటు త్వరలో 5G నెట్‌వర్క్‌ను కూడా ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తొలుత కొన్ని ప్రధాన నగరాల్లో 5G అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
నెట్‌వర్క్ సమస్యలు చాలావరకు 4G తో చెక్‌పెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్, యూజర్లకు అవసరం అయ్యే ప్లాన్‌లను కూడా తీసుకొస్తోంది. మరియు పండుగల సందర్భాల్లో ప్రత్యేక ఆఫర్లను ప్రకటన చేస్తోంది. ఇటీవల తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆగస్టు నెలలో ఏకంగా 13.85 లక్షల మంది యూజర్లను సంపాదించుకుంది.

ఆగస్టు నెలలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా ప్లాన్ పేరుతో కేవలం రూ.1 కే రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీపావళి సందర్భంగా దీపావళి బొనాంజా పేరుతో ఇదే ప్లాన్‌ను ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్ 15 వ తేదీ నుంచి నవంబర్ 15 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
ఈ ప్లాన్‌లో భాగంగా రూ.1 కే అన్‌లిమిటెడ్ కాల్స్‌ను అందిస్తుంది. మరియు రోజువారీ 100 SMS లను కూడా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం కొత్త యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ :
తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ మరో రీఛార్జ్ ప్లాన్‌ను (BSNL Samman plan) ప్రకటించింది. ఈ ప్లాన్ కొన్ని రోజులపాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా యూజర్లు 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. దీంతోపాటు BiTV సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు.
రూ.1812 రీఛార్జ్ ప్లాన్ :
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1812 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంటుంది. దీంతోపాటు 6 నెలల వరకు BiTV సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు.
Celebrate connectivity this festive season with the BSNL Samman Offer!
— BSNL India (@BSNLCorporate) October 21, 2025
Exclusively for new senior citizens users, enjoy 2GB/day data, unlimited voice calls, 100 SMS/day, and a free BiTV subscription for 6 months - all valued at ₹1812!
Offer valid from 18 Oct – 18 Nov 2025… pic.twitter.com/x0Er34qnsS
ఈ ప్లాన్ అక్టోబర్ 18 నుంచి అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 18 వ తేదీ, 2025 వరకు అమల్లో ఉంటుంది. ఈ ప్లాన్ కేవలం కొత్తగా సిమ్ కొనుగోలు చేసిన సీనియర్ సిటిజన్‌లకు మాత్రమే, ఇతరులకు అవకాశం లేదు. ఈ ఆఫర్ కోసం BSNL కామన్ సర్వీస్ సెంటర్లు, రిటైలర్లను సంప్రదించాలని సూచించింది.
* టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ సంవత్సరం ఆగస్టు నెలలో BSNL ఏకంగా 13.85 లక్షల కొత్త యూజర్లను సంపాదించుకుంది. ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్ కూడా భారీగా యూజర్లను సంపాదించుకున్నాయి. వోడాఫోన్ ఐడియా మాత్రం భారీగా యూజర్లను కోల్పోయింది.
ఆగస్టు 2025 నెలలో జియో నెట్‌వర్క్‌లో కొత్తగా 19 లక్షల యూజర్లు, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో 4.96 లక్షల మంది యూజర్లు చేరారు. వోడాఫోన్ ఐడియా మాత్రం 3.08 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. ఈ వివరాలతో దేశంలో మొబైల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 122.45 కోట్లకు చేరింది.


Click it and Unblock the Notifications








