BSNL Rs197 Vs Rs199 ఈ రెండు రీఛార్జ్ ప్లాన్‌లో యూజర్లకు ఏది బెస్ట్.. పూర్తి వివరాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవలే 4G నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా సుమారుగా దేశవ్యాప్తంగా లక్ష టవర్లను ఏర్పాటు చేసింది. దీంతోపాటు 5G నెట్‌వర్క్ ను కూడా వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనిచేస్తోంది. ప్రస్తుతం యూజర్ల పరంగా బీఎస్‌ఎన్‌ఎల్ ( భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ) నాలుగో స్థానంలో ఉంది.
అయితే యూజర్ల సంఖ్యను పెంచుకోవడం సహా స్థిరమైన నెట్‌వర్క్‌ను అందించేందుకు వీలుగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం రూ.200 కంటే తక్కువ ధరలో రెండు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ చేసుకోవచ్చు.

రూ.197, రూ.199 రీఛార్జ్ ప్లాన్‌లు :
BSNL రూ.197, రూ.199 రీఛార్జ్ ప్లాన్ లను యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. అయితే బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవలే రూ.197 రీఛార్జ్ ప్లాన్‌లో మార్పులు చేసింది. అయితే ఈ రెండు ప్లాన్‌లు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తున్నాయి. యూజర్లకు ఏ రీఛార్జ్ ప్లాన్ ఉత్తమం.
బీఎస్ఎన్‌ఎల్ రూ.197 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో ( BSNL Rs197 Recharge Plan ) భాగంగా యూజర్లు 300 నిమిషాల లోకల్, STD కాల్స్ చేసుకోవచ్చు. మరియు మొత్తంగా 4GB డేటాను అందిస్తోంది. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్ వేగం 40 kbps గా ఉంటుంది. మరియు మొత్తంగా 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 54 రోజులుగా ఉంది.
తక్కువ ధరలో ఎక్కువ రోజులపాటు వ్యాలిడిటీ వ్యాలిడిటీ కావాలనుకొనే యూజర్లకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తక్కువ కాల్స్, డేటా, SMS లు వినియోగించే వారికి ప్లా్‌న్ అనుకూలంగా ఉంటుంది. ఇతర టెలికాం నెట్‌వర్క్ లో ఈ తరహా ప్రయోజనాల కోసం ఎక్కువగా చెల్లించాల్సి రావచ్చు.
BSNL Rs199 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో ( BSNL Rs199 Recharge Plan ) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు డేటా పరంగా ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్ వేగం 40 kbps గా ఉంటుంది.
ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. ఎక్కువగా కాల్స్, డేటాను ఉపయోగించుకొనే యూజర్లకు ఈ రీఛార్జ్ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రయోజనాలను ఇతర టెలికాం నెట్‌వర్క్ లో పొందాలంటే అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది.
ఈ రెండు ప్లాన్ లో యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకుంటే రూ.197 రీఛార్జ్ ప్లాన్ ను ఎంచుకోవచ్చు. అదే అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ డేటాను పొందాలంటే రూ.199 రీఛార్జ్ ప్లాన్ ను ఎంపిక చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








