గుడ్‌న్యూస్ చెప్పిన బీఎస్ఎన్‌ఎల్.. రూ.200 కంటే తక్కువ ధరకే రోజువారీ 2GB డేటా ప్లాన్, అన్‌లిమిటెడ్ కాలింగ్
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ఇటీవల 4G నెట్‌వర్క్ కోసం దేశవ్యాప్తంగా లక్ష టవర్లను ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరం కూడా నెట్‌వర్క్ విస్తరణ కోసం భారీగా వెచ్చించనున్నట్లు వెల్లడించింది. గత సంవత్సరంలో పోలిస్తే సుమారు 50 శాతం అదనపు నిధులు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు అన్ని విభాగాల్లో యూజర్లను ఆకట్టుకొనేందుకు ప్రత్యేక ప్లాన్‌లను తీసుకొస్తోంది.
ఇందులో భాగంగా మొబైల్ యూజర్లను ఆకట్టుకొనేందుకు వీలుగా రూ.199 రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ప్రయోజనాలతోపాటు ఇతర టెలికాం నెట్‌వర్క్‌లతో పోలిస్తూ X ప్లాట్‌ఫాంలో పోస్ట్ చేసింది. ఇతర నెట్‌వర్క్‌ల కంటే తమ ప్లాన్ ఎంత ప్రయోజనకరమో వెల్లడించే ప్రయత్నం చేసింది.

రూ.200 కంటే తక్కువ ధరలో :
BSNL X పోస్ట్ ఆధారంగా రూ.199 తో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను (BSNL Rs199 Recharge Plan) తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్‌ను అందిస్తోంది. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 2GB డేటాను అందిస్తోంది.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంటుందని BSNL తెలిపింది. తక్కువ ధరలో డేటా, కాలింగ్ కోసం చూసేవారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఇదే ధరలో ఇతర టెలికాం సంస్థలు తక్కువ వ్యాలిడిటీ మరియు తక్కువ డేటా ను మాత్రమే అందిస్తున్నాయి.
ఇవాళే లాస్ట్ :
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన ఆజాదీ కా ప్లాన్ గడువు ఇవాళ్టితో ముగిసిపోనుంది. కొత్తగా కొనుగోలు చేసిన సిమ్ కార్డులపై రూ.1 రీఛార్జ్‌తో రోజువారీ 2GB డేటాతోపాటు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్ మరియు రోజువారీ 100 SMS లను అందించింది.
25 ఓటీటీ, 450 టీవీ ఛానళ్లు :
అయితే బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవలే రూ.151 BiTV ప్రీమియం ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా ఓటీటీలతోపాటు లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఆహా, జీ5, ఈటీవీ విన్, సోనిలివ్, ఎపిక్ ఆన్, Sun Nxt, డిస్కవరీ ప్లస్, లైన్స్‌గేట్, Shemaroo వంటి 25 పైగా ఓటీటీలను ఉపయోగించుకోవచ్చు.
దీంతోపాటు 450 కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. BiTV మొబైల్ యాప్ ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీపై BSNL అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా 30 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుందని తెలుస్తోంది.
ఫైబర్ టీవీ బేసిక్ ప్లాన్ :
దీంతోపాటు ఇటీవలే రూ.400 కే ఫైబర్ టీవీ బేసిక్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో ట్రిపుల్ ప్లే సర్వీసులను పొందవచ్చు. అంటే బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్, టీవీ ఛానల్స్ వీక్షించవచ్చు. 20 Mbps వేగంతో డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు ల్యాండ్‌లైన్ సదుపాయం కూడా ఉంటుంది. లోకల్, STD కాల్స్‌ను ఉచితంగా చేసుకోవచ్చు. దీంతోపాటు 400 పైగా టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. తక్కువ ధరలో ట్రిపుల్ పే సర్వీసుల కోసం చూస్తున్న వారికి ఈ ఆఫర్ అనుకూలంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








