రోజువారీ 2GB డేటా, 30 రోజుల వ్యాలిడిటీతో BSNL రీఛార్జ్ ప్లాన్.. తక్కువ ధరకే..!
జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరల పెంపుతో అనేక మంది యూజర్లు BSNL కు పోర్టింగ్ అవుతున్నారు. దీంతోపాటు 4G, 5G నెట్ వర్క్ అందుబాటులోకి రానుండడం, తక్కువ ధరకే మెరుగైన ప్రయోజనాలు అందించడంతో BSNL వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) తక్కువ ధరలో (BSNL RS229 Prepaid Recharge Plan) అధిక డేటాతో కూడిన ప్రయోజనాలను అందిస్తోంది.
ప్రస్తుతం BSNL అనేక ఆకట్టుకొనే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లను అందిస్తోంది. ఇతర ప్రైవేటు టెలికాం సంస్థల ప్లాన్ ల ధరలతో పోలిస్తే తక్కువ ధరకే సేవలు అందిస్తోంది. ఇటీవల 30 రోజుల వ్యాలిడిటీతో తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. మరియు 2GB రోజువారీ డేటాను కూడా పొందవచ్చు.

BSNL రూ.229 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను అందిస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగా రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. అంటే ప్లాన్ వ్యాలిడిటీలో 60GB డేటాను పొందవచ్చు. 2GB డేటాతో, 30 రోజుల వ్యాలిడిటీని కేవలం తక్కువ ధరకే BSNL అందిస్తోంది.
* దీంతోపాటు బీఎస్‌ఎన్‌ఎన్ రూ.1999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు మొత‌్తంగా 600GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ డేటా వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. అంటే రోజువారీ డేటా వినియోగంపై ఎటువంటి పరిమితి లేదు. దీంతోపాటు మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
* బీఎస్‌ఎన్‌ఎల్ రూ.2,399 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 395 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. అంటే సగటున రూ.190 ఖర్చు కానుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజుకు 100 SMS లను పొందవచ్చు. రోజుకు 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా ట్యూన్స్, హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరీనా గేమ్స్ ప్రయోజనాలకు కూడా పొందవచ్చు.
దీంతోపాటు తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ కోసం BSNL మరో రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉంది. ఈ రూ.197 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా 70 రోజుల వ్యాలిడిటితో వస్తుంది. సిమ్ కార్డు యాక్టివ్‌గా ఉండాలనే భావించే వారికోసం ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్‌లో భాగంగా మొదటి 15 రోజులపాటు రోజువారీ 2GB డేటా, కాలింగ్ సహా SMS ప్రయోజనాలను పొందవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








