కేవలం రూ.1 కే 1 GB డేటా, 60 రోజుల వ్యాలిడిటీతో ధర రూ.251 రీఛార్జ్ ప్లాన్..! పూర్తి వివరాలు
ప్రస్తుతం IPL 2025 సీజన్ జరుగుతోంది. భారీ స్థాయిలో క్రికెట్ అభిమానులు టీవీలు, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వీక్షిస్తున్నారు. యువతలో ఎక్కువ శాతం స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా ఐపీఎల్ మ్యా్చ్‌లను చూస్తున్నారు. దీంతోపాటు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) వంటి టెలికాం సంస్థలు డేటా ప్లాన్‌లతోపాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ను అందించే రీఛార్జ్ ప్లాన్ లను విడుదల చేశాయి.
తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. కేవలం 1 రూపాయి ధరకే 1GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతున్న నేపథ్యంలో ఈ రీఛార్జ్ ప్లాన్ యూజర్‌లకు వినియోగపడే అవకాశం ఉంది.

BSNL రూ.251 రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా 251GB డేటాను వినియోగించుకోవచ్చు. అంటే కేవలం రూ.1 కే 1GB డేటా ను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 60 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో డేటా మినహా కాలింగ్, SMS లను అందించడం లేదు.
కేవలం డేటా కోసం ఈ ప్లాన్‌ను అందుబాటులో తీసుకొచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్, సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. క్రికెట్ మ్యాచ్‌లను చూసే వారికి ఈ బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
BSNL రూ.319 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్ చేసుకోవచ్చు. మరియు 300 SMS లను పొందవచ్చు. డేటా పరంగానూ ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 10GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 65 రోజులుగా ఉంది.
కేవలం కాలింగ్ కోసమే మరో రీఛార్జ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. రూ.439 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చు. మరియు వ్యాలిడిటీ మొత్తంలో 300 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటాను అందించడం లేదు.
#Cricket fever just got hotter!
— BSNL India (@BSNLCorporate) March 29, 2025
Get 251GB of high-speed data for just ₹251 and enjoy 60 days of non-stop cricket action. Stream every match, catch every score – because the game never stops!
Hurry up, Limited period offer!
Recharge now : https://t.co/BpQ0ErkyVX#BSNLIndia… pic.twitter.com/spmjxNQSZf
BSNL 4G, 5G నెట్‌వర్క్‌పై కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. సంస్థ సీఎండీ ఈ వివరాలను వెల్లడించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 వేలకు పైగా 4G టవర్లు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు. మరియు 80 వేలకు పైగా ఇన్‌స్టాల్ చేసినట్లు తెలిపారు. మే - జూన్ నాటికి లక్ష టవర్లను ఏర్పాటు చేసిన వినియోగంలోకి తీసుకొస్తామన్నారు.
అదే విధంగా 5G నెట్‌వర్క్ వివరాలను కూడా వెల్లడించారు. జూన్ నుంచి 5G నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. తొలి దశలో ఢిల్లీలో లాంచ్ చేస్తామని, ఇందుకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. వీలైనంత వేగంగా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తామన్నారు. గత సంవత్సరం బీఎస్‌ఎన్‌ఎల్ 5G టెస్టింగ్ ను కూడా నిర్వహించింది.
నెట్‌వర్క్ యాజ్ ఏ సర్వీస్ (NaaS) మోడల్‌లో ఢిల్లీలో బీఎస్‌ఎన్‌ఎల్ 5G ప్రారంభిస్తామన్నారు. BSNL 4G కోసం టీసీఎస్ నేతృత్వంలోని కాన్సార్షియంలో C-DoT (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్) మరియు తేజస్ నెట్‌వర్క్ ఉన్నాయి. టెక్నాలజీ పరంగా TCS కృషిచేస్తోంది.


Click it and Unblock the Notifications








