Home
News

రూ.251 రీఛార్జ్‌ ప్లాన్‌తో ఏకంగా 100GB డేటా.. పూర్తి వివరాలు..!

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 4G నెట్‌వర్క్ తీసుకొచ్చింది. 97 వేలకు పైగా 4G టవర్లను ఏర్పాటు చేసింది. అయితే ఇటీవలే దేశ రాజధాని ప్రాంతం (ఢిల్లీ NCR) లో మరో 10 వేల టవర్ల ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే ఇటీవల బీఎన్‌ఎన్‌ఎల్‌ సంస్థ యూజర్లను ఆకట్టుకొనేందుకు అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను తీసుకుంటోంది. తాజాగా స్టూడెంట్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.251 ధరతో (BSNL Rs251 Recharge Plan) ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ నవంబర్‌ 14 నుంచి అందుబాటులోకి వచ్చింది. డిసెంబర్‌ 13 వ తేదీ వరకు అమల్లో ఉంటుంది.

BSNL Rs251 Recharge Plan

BSNL రూ.251 రీఛార్జ్ ప్లాన్‌ :
ఈ స్టూడెంట్‌ ప్లాన్ లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. అయితే ఈ ఫోన్‌లో ఏకంగా 100GB 4G డేటాను పొందవచ్చు. రోజువారీగా ఎటువంటి పరిమితి లేకుండా డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

ఈ స్టూడెంట్‌ ప్లాన్‌ను యాక్టివేట్‌ చేసుకొనేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్లు లేదా 18001801503 నంబర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. లేదా bsnl.co.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుందని తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. అనేక రీఛార్జ్‌ ప్లాన్ల డేటాతో పాటు వ్యాలిడిటీని తగ్గించింది.

ప్లాన్‌లలో కీలక మార్పులు చేసిన BSNL :
ఇటీవల రూ.147 రీఛార్జ్‌ ప్లాన్‌లో గతంలో 10GB డేటాను అందించేది. ప్రస్తుత 5GB డేటాను మాత్రమే అందిస్తోంది. రూ.197 రీఛార్జ్ ప్లాన్‌లో గతంలో 54 రోజుల వ్యాలిడిటీని అందించేది. ప్రస్తుతం 48 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్‌లో ప్రస్తుతం 300 నిమిషాల కాలింగ్‌, 100 SMS లను అందిస్తోంది. 4GB డేటాను వినియోగించుకోవచ్చు.

రూ.319 రీఛార్జ్ ప్లాన్‌లో గతంలో 65 రోజుల వ్యాలిడిటీ ఉండేది. ప్రస్తుతం 60 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్‌ లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, మొత్తంగా 300 SMS, 10GB డేటాను అందిస్తోంది. రూ.439 రీఛార్జ్‌ ప్లాన్‌లో గతంలో 90 రోజుల వ్యాలిడిటీ ఉండేది. ప్రస్తుతం 80 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, మొత్తంగా 300 SMS లను మాత్రమే అందిస్తోంది.

వీటితోపాటు రూ.599 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ ఉండేది. ప్రస్తుతం 70 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లు, రోజువారీ 3GB డేటాను అందిస్తోంది. రూ.897 రీఛార్జ్‌ ప్లాన్‌లో 160 రోజుల వ్యాలిడిటీ ఉండేది. ప్రస్తుతం 150 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, రోజువారీ 100 SMS లు, రోజువారీ 2GB డేటాను అందిస్తోంది. రూ.1499 రీఛార్జ్‌ ప్లాన్‌ వ్యాలిడిటీ 300 రోజులకు తగ్గించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Rs251 Recharge Plan Offers 100GB Data with 28 days validity full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X