Home
News

రూ.300 కంటే తక్కువ BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌తో 52 రోజులపాటు వ్యాలిడిటీ.. పూర్తి ప్రయోజనాలు..!

BSNL ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్ విస్తరణ, 5G నెట్‌వర్క్‌ను కూడా వేగంగా లాంచ్ చేసేందుకు వీలుగా సన్నాహాలు సహా అందుబాటులో ధరలో ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌లతో క్రమంగా యూజర్‌లను పెంచుకుంటోంది. ప్రైవేటు టెలికాం సంస్థలతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకే సేవలు అందిస్తోంది. తాజాగా BSNL (భారత్‌ సంచార్ నిగమ్‌ లిమిటెడ్‌) కొత్త లోగోను విడుదల చేసింది. దీంతోపాటు 7 కొత్త ఫీచర్‌లను కూడా విడుదల చేసింది. అక్టోబర్‌ 22న ఢిల్లీలో ఈ విడుదల కార్యక్రమం నిర్వహించారు.

ప్రైవేటు టెలికాం ప్రొవైడర్‌లతో పోలిస్తే ఇప్పటికే BSNL అందుబాటు ధరల్లో రీఛార్జ్‌ ప్లాన్‌లను అందిస్తోంది. అయితే నిన్న జరిగిన లోగా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న BSNL సీఎండీ రాబర్ట్‌ రవి.. సమీప భవిష్యత్‌తో మొబైల్‌ రీఛార్జ్ టారిఫ్‌ ధరలు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. యూజర్ల విశ్వాసాన్ని పొందడమే తమ లక్ష్యమని తెలిపారు.

BSNL RS298 Prepaid Recharge Plan

BSNL ఇటీవల రూ.298 ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ను (BSNL RS298 Prepaid Recharge Plan) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ ద్వారా 52 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS మరియు 52GB డేటాను పొందవచ్చు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.347 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 54 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారి 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా మొత్తంగా 108GB డేటాను వినియోగించుకోవచ్చు.

రూ.397 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా ఏకంగా 150 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా తొలి 30 రోజులపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, 2GB రోజువారీ డేటా, ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. 30 రోజుల అనంతరం సిమ్‌ కార్డు యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌కమింగ్‌ కాల్స్‌ పొందవచ్చు. BSNL ను రెండో సిమ్‌ కార్డుగా వినియోగించేవారికి ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది.

అక్టోబర్‌ 22 వ తేదీన ఏర్పాటు చేసిన లోగో విడుదల కార్యక్రమంలో కొత్త ఫీచర్‌లను విడుదల చేశారు. BSNL యూజర్లకు సురక్షితమైన నెట్‌వర్క్‌ను అందించేందుకు వీలుగా స్పామ్‌ బ్లాకర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా మోసపూరిత కాల్స్‌ మరియు మెసేజ్‌ లను ఆటోమేటిక్‌గా గుర్తించి, బ్లాక్ చేస్తుంది.

ప్రస్తుతం BSNL 4G నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టవర్ల నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా లక్ష టవర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గత వారానికి 38 వేలకు పైగా 4G టవర్లను ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరం చివరి నాటికి 75 వేల టవర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

పూర్తి స్వదేశీయంగానే C-DOT మరియు TCS భాగస్వామ్యంతో 4G టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. దీంతోపాటు 5G నెట్‌వర్క్‌ లాంచింగ్‌ వివరాలను కూడా కేంద్ర టెలికాం మంత్రి జోతిరాదిత్య సింధియా వెల్లడించారు. 2025 జూన్‌ నాటికి 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL RS298 Prepaid Recharge Plan offers 52 days validity with unlimited calling full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X