3GB రోజువారీ డేటాతో BSNL బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు... కాలింగ్, వ్యాలిడిటీ సహా ఇతర ప్రయోజనాలు..!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL శరవేగంగా 4G టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను అందించేందుకు వీలుగా లక్ష టవర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇటీవల వెల్లడించిన వివరాల ఆధారంగా 93,450 టవర్లు యాక్టివ్‌లోకి తీసుకొచ్చింది. 4G అనంతరం 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెలలో మొత్తంగా లక్ష టవర్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
దీంతోపాటు జూన్ నెలలోనే 5G ట్రయల్స్ కూడా చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరియు దేశ రాజధాని ఢిల్లీలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో తొలుత 5G నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది. అనంతరం వీలైనంత తక్కువ సమయంలోనే ముఖ్యమైన నగరాల్లో 5G తీసుకురావాలని భావిస్తున్నట్లు గతంలోనే BSNL వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం దేశ టెలికాం రంగంలో BSNL నాలుగో స్థానంలో ఉంది. యూజర్ల పరంగా జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. గతంతో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్ల పరంగా పుంజుకుంటోంది. ఇటీవలే 2025 నాలుగో త్రైమాసికంలో రూ.280 కోట్ల లాభాలు వచ్చినట్లు సంస్థ తెలిపింది.
యూజర్లను పెంచుకొనేందుకు నెట్‌వర్క్‌ను మరింత మెరుగుపరచడం సహా తక్కువ ధరలో అనేక రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. యూజర్ల కాలింగ్, SMS, డేటా అవసరాలకు అనుగుణంగా అనేక ప్లాన్‌లు ఉన్నాయి. ప్రస్తుతం రోజువారీ 3GB డేటాను అందించే రెండు బెస్ట్ ప్లాన్‌లు ఉన్నాయి.
రూ.299 రీఛార్జ్ ప్లాన్ :
BSNL యూజర్లు ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో (BSNL Rs299 Recharge Plan) భాగంగా ప్రతిరోజు 3GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్ స్పీడ్ 40kbps కు తగ్గుతుంది.
దీంతోపాటు రోజువారీ 100 SMS లను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. రోజువారీ ఎక్కువ డేటా అవసరాలు ఉండే యూజర్లకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
రూ.599 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో (BSNL Rs599 Recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు.
డేటా పరంగా ప్రతిరోజు 3GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్ స్పీడ్ 40kbps గా ఉంటుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది. ఎక్కుల రోజుల వ్యాలిడిటీతోపాటు డేటా కావాల్సిన యూజర్లు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.
* ట్రాయ్ (టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఇటీవల ఏప్రిల్ 2025 నివేదికను వెల్లడించింది. దీని ఆధారంగా ఏప్రిల్ నెలలో జియోలోకి కొత్తగా 26 లక్షల మంది యూజర్లు చేరారు. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లోకి 1.70 లక్షల మంది చేరారు. అయితే BSNL, వోడాఫోన్ ఐడియా భారీగా యూజర్లను కోల్పోయారు.
BSNL ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఏకంగా 1.55 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. అదే విధంగా మరో సంస్థ వోడాఫోన్ ఐడియా 6 లక్షలకు పైగా యూజర్లను కోల్పోయింది. ఇటీవల కాలంలో ఈ రెండు సంస్థలు తరచుగా యూజర్లను కోల్పోతున్నాయి.


Click it and Unblock the Notifications








