రూ.347 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో అన్‌లిమిడెట్ కాలింగ్ సహా 165GB డేటా.. పూర్తి వివరాలు..!
ప్రైవేటు టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్- ఐడియా మొబైల్ రీఛార్జ్ టారిఫ్‌ల పెంపుతో BSNL వైపు భారీగా వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) పోర్టింగ్ అవుతున్నారు. పాత ధరలకే బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు అందించడం సహా త్వరలో 4G సేవలు ప్రారంభం కానుండడంతో కొత్త కస్టమర్లలు ప్రభుత్వ రంగ టెలికాం నెట్‌వర్క్‌లో జాయిన్ అవుతున్నారు.
అయితే ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ అనేక రీఛార్జ్ ప్లాన్‌లు అందిస్తోంది. డేటా సహా వ్యాలిడిటీ పెంచే ప్లాన్‌లను అందిస్తోంది. రూ.347 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ ప్లాన్లో భాగంగా కాలింగ్, డేటా, SMS ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 54 రోజులుగా ఉంది.

BSNL రూ.347 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్ వ్యాలిడిటీ 54 రోజులుగా ఉంది. ఈ ప్లాన్లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 3GB డేటా చొప్పున మొత్తంగా 165GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అదనంగా 3GB డేటాను పొందవచ్చు.
దీంతోపాటు తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన ప్లాన్ కోసం BSNL మరో రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉంది. రూ.197 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో 70 రోజుల వ్యాలిడిటితో వస్తుంది. సిమ్ కార్డు యాక్టివ్‌గా ఉంచేందుకు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్లో భాగంగా మొదటి 15 రోజులపాటు రోజువారీ 2GB డేటా, కాలింగ్ సహా SMS ప్రయోజనాలను పొందవచ్చు.
BSNL రూ.229 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. ప్లాన్ వ్యాలిడిటీలో మొత్తంగా 60GB డేటాను పొందవచ్చు.
అయితే ఎక్కువ వ్యాలిడిటీ కావాలని భావించేవారికి బీఎస్‌ఎన్‌ఎల్ మరో ప్లాన్‌ను అందిస్తోంది. ఈ రూ.397 రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఏకంగా 150 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్లో భాగంగా తొలి 30 రోజులపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 2GB డేటా, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. అయితే 150 రోజులపాటు ఇన్‌కమింగ్ కాల్ సదుపాయం ఉంది.
దీంతోపాటు BSNL రూ.997 రీఛార్జ్ ప్లాన్ ద్వారా అన్‌లిమిడెట్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లతోపాటు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 160 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 320GB డేటాను వినియోగించుకోవచ్చు. ప్రైవేటు టెలికాం సంస్థలు ఇదే ధరకు సుమారుగా 90 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తున్నారు.
బీఎస్‌ఎన్‌ఎన్ రూ.1999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో మొత్తంగా 600GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. రోజువారీ డేటా వినియోగంపై ఎటువంటి పరిమితి లేదు. అంటే ఈ 600GB డేటాలో రోజుకు ఎంత డేటాను అయినా వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications