మిగిలిన టెలికాం సంస్థలు 28 రోజుల వ్యాలిడిటీ అందిస్తే.. BSNL ఏకంగా 54 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల సుమారు 17 సంవత్సరాల తర్వాత లాభాల్లోకి వచ్చింది. గత సంవత్సరం జులై నెలలో ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి. దీంతో లక్షలాది మంది యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) లోకి వచ్చారు. అయితే నెట్‌వర్క్ కనెక్టివిటీ సమస్యలు, కాల్ డ్రాప్ వంటి సమస్యలతో నవంబర్, డిసెంబర్ నెలల్లో మొత్తంగా 6 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి ఇతర సంస్థలకు పోర్టింగ్ అయ్యారు.
వినియోగదారులను కోల్పోకుండా ఉండేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ చర్యలు తీసుకుంటోంది. నెట్‌వర్క్ టవర్ల వద్ద బ్యాటరీలను ఏర్పాటు చేస్తోంది. దీంతోపాటు 4G నెట్‌వర్క్ టవర్ల ఏర్పాటును వేగవంతం చేసింది. మరియు యూజర్లను ఆకట్టుకొనేందుకు తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ రూ.347 రీఛార్జ్ ప్లాన్‌ను (BSNL Rs347 Recharge Plan) తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా ఏకంగా 54 రోజుల పాటు వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు.
డేటా పరంగా ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటాను అందిస్తోంది. అంటే ప్లాన్‌లో భాగంగా మొత్తంగా 108GB డేటాను పొందవచ్చు. తక్కువ ధరకే బీఎస్‌ఎన్‌ఎల్ మెరుగైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇదే ధరకు ఇతర టెలికాం ప్రొవైడర్‌లు కేవలం 28 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తున్నాయి.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.439 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ (BSNL Rs439 Recharge Plan) 90 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, మరియు ప్లాన్ వ్యాలిడిటీతో 300 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటాను అందించడం లేదు.
కేంద్ర టెలికాం శాఖ మంత్రి జోతిరాధిత్య సింధియా ఇటీవల కీలక ప్రకటన చేశారు. ఓ ఇంటర్య్వూలో BSNL 4G, 5G సేవల ప్రారంభంపై స్పష్టత నిచ్చారు. దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ కోసం లక్ష 4G నెట్‌వర్క్ టవర్లను ఏర్పాటు చేస్తున్నామని.. ఇప్పటికే 89 వేల సైట్ల ఇన్‌స్టాలేషన్ పూర్తయినట్లు చెప్పారు.
ఇందులో 72 వేలకు పైగా సైట్లు యాక్టివ్‌గా ఉన్నాయని చెప్పారు. ఈ సంవత్సరం మే- జూన్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం 5G నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. అనంతరం క్రమంగా విస్తరిస్తామని తెలిపారు. ఇందుకు కొన్ని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్ అవసరం అని చెప్పారు.
మరో ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా నిన్న ముంబైలో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. వచ్చే నెల నుంచి దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూర్, మైసూర్, పాట్నా, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. అనంతరం మహారాష్ట్ర, చెన్నై, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో లాంచ్ చేస్తామని తెలిపింది.
Vi రూ.299 మరియు అంతకంటే ఎక్కువ రీఛార్జ్‌లపై అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఈ ప్రకటన చేసిందిం. ఎన్ని రోజులపాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందో వెల్లడించలేదు. వచ్చే మూడు సంవత్సరాల కాలంలో 17 టెలికాం సర్కిల్స్‌లోని 100 నగరాలకు 5G నెట్‌వర్క్‌ను విస్తరిస్తామని వోడాఫోన్ ఐడియా చెబుతోంది.


Click it and Unblock the Notifications








