Home
News

BSNL రూ.397 రీఛార్జ్‌ ప్లాన్‌తో 150 రోజుల వ్యాలిడిటీ.. 2GB డేటా సహా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌..!

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL కు ప్రస్తుతం రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. గత నెలలో ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌- ఐడియా సంస్థలు మొబైల్‌ టారిఫ్‌ ఛార్జీలు పెంచడంతో ఎక్కువ మంది యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సర్కిళ్లలో కొత్త వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. 5G సర్వీసులను కూడా వచ్చే సంవత్సరం అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. 4G నెట్‌వర్క్‌ కోసం దేశవ్యాప్తంగా లక్షకు పైగా టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 25 వేల టవర్ల ఏర్పాటు పూర్తయినట్లు తెలుస్తోంది.

BSNL RS397 Prepaid recharge plan

ఇతర టెలికాం నెట్‌వర్క్‌లతో పోలిస్తే బీఎస్‌ఎన్ఎల్‌ తక్కువ ధరలోనే అధిక ప్రయోజనాలను అందిస్తోంది. BSNL రూ.397 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా ఏకంగా 150 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఇన్‌కమింగ్‌ కాల్స్‌ కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ ను వినియోగించే వాళ్లకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.397 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ : ఈ ప్లాన్‌ ద్వారా ఏకంగా 150 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా తొలి 30 రోజులపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 2GB డేటా, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. అయితే 150 రోజులపాటు ఇన్‌కమింగ్‌ కాల్‌ సదుపాయం ఉంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 5G సేవలను 2025 సంక్రాంతి నాటికి ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై BSNL ఆంధ్రప్రదేశ్‌ ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ ధ్రువీకరించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G నెట్‌వర్క్‌ను అక్టోబర్‌లో ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. 4G ట్రయల్‌ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలుస్తోంది.

BSNL రూ.997 రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా ఏకంగా 160 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిడెట్‌ కాలింగ్‌ సహా SMS లను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. మొత్తంగా 320GB డేటాను వినియోగించుకోవచ్చు.

BSNL రూ.1999 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 600GB డేటాను పొందవచ్చు. ఈ డేటాను వినియోగించుకొనేందుకు ఎటువంటి రోజువారీ పరిమితులు లేవు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను కూడా వినియోగించుకోవచ్చు.

BSNL ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ రూ.2399 తో 395 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు హలో ట్యూన్స్ సహా ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL RS397 Prepaid recharge plan offers 150 days and 2GB 4G data full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X