Home
News

BSNL ను సెకండ్‌ సిమ్‌గా వినియోగిస్తున్నారా.. అయితే ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ మీకు పనికొస్తుంది..?

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ప్రస్తుతం శరవేగంగా 4G నెట్‌ వర్క్ టవర్‌ లను ఏర్పాటు చేస్తోంది. దేశవ్యాప్తంగా 50 వేలకు పైగా టవర్లను ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే వెల్లడించింది. ఈ సంవత్సరం చివరి నాటికి 75 వేల టవర్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఇటీవల BSNL నెట్‌వర్క్‌ కు భారీ సంఖ్యలో యూజర్లు పోర్టింగ్‌ అవుతున్నారు. భారత్‌ సంచార్‌ నిగమ్ లిమిటెడ్‌ (BSNL) సంబంధించిన వివరాలను ట్రాయ్‌ (TRAI) వెల్లడించింది. అదే సమయంలో ప్రైవేటు టెలికాం సంస్థలు భారీగా యూజర్‌ లను కోల్పోతున్నాయి.

ప్రస్తుతం BSNL అనేక ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లను అందిస్తోంది. ఇతర టెలికాం నెట్‌వర్క్‌లతో పోలిస్తే భారీ తక్కువ ధరకే మెరుగైన ప్లాన్‌లను అందిస్తోంది. యూజర్‌ ల అవసరాలకు అనుగుణంగా వ్యాలిడిటీ, డేటా సహా ఇతర ప్లాన్‌లను అందుబాటులో ఉంచింది. అయితే BSNL ను రెండో సిమ్‌గా వినియోగించే యూజర్లు రూ.397 ప్లాన్‌ను (BSNL RS397 Prepaid Recharge plan) ఎంచుకోవచ్చు.

BSNL RS397 Prepaid Recharge plan

BSNL రూ.397 రీఛార్జ్‌ ప్లాన్‌ : ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌తో 150 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అయితే తొలి 30 రోజులపాటు మాత్రమే కాలింగ్‌ సహా ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. అంటే తొలి 30 రోజులపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 2GB డేటా, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా మొత్తంగా 150 రోజులపాటు సిమ్‌ యాక్టివ్‌గా ఉంటుంది. ఫలితంగా ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు ఎటువంటి ఆటంకం కలగదు. BSNL సిమ్‌ కార్డును రెండో ప్రాధాన్యత సిమ్‌గా వినియోగించే యూజర్‌లకు ఈ రీఛార్‌ ప్లాన్ అనువుగా ఉంటుంది. ఇదే తరహాలో మరో ప్లాన్‌ను కూడా BSNL అందుబాటులో ఉంచింది.

BSNL రూ.1198 రీఛార్జ్‌ ప్లాన్‌తో ఏకంగా 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. మరియు ప్రతి నెల 300 నిమిషాల కాల్స్‌ మాట్లాడుకోవడం సహా 3GB డేటాను పొందవచ్చు. వీటితోపాటు నెలవారీ 30 SMS వరకు ప్రతి నెల వినియోగించుకోవచ్చు. కాలింగ్, డేటాను తక్కువగా వినియోగించేవారికి ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది.

BSNL రూ.997 రీఛార్జ్ ప్లాన్‌తోనూ ఎక్కువ వ్యాలిడిటీని పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 160 రోజులుగా ఉంటుంది.

BSNL 4G నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా 2025 మధ్యనాటికి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. DoT, టాటా సంస్థల మధ్య ఒప్పందంలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో BSNL 4G టెక్నాలజీని సమకూర్చుకున్నారు. 4G నుంచి సులభంగా 5G నెట్‌వర్క్‌కు మారేందుకు అవకాశం ఉంటుందని సంస్థ చెబుతోంది. దీంతోపాటు జూన్‌ 2025 నాటికి బీఎస్‌ఎన్‌ఎల్‌ 5G నెట్‌వర్క్‌ను కూడా ప్రారంభిస్తామని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా గతంలోనే వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సన్నాహకాలు పూర్తయినట్లు చెప్పారు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL RS397 Prepaid Recharge plan offers 150 days validity and check calling and data benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X