Home
News

BSNL యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.400 కే ఇంటర్నెట్‌, ల్యాండ్‌లైన్‌, 400 టీవీ ఛానళ్లు..!

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌) యూజర్లకు ఆకట్టుకొనేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. నెట్‌వర్క్‌ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా స్వాతంత్ర్య దినోత్సరం సందర్భంగా ఆజాదీ కా ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.1 కే రీఛార్జ్‌తో కొత్త యూజర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది.

రూ.400 ధరకే :
అయితే BSNL నుంచి తాజాగా కీలక ప్రకటన (BSNL RS400 Fiber basic plan) వెలువడింది. కేవలం రూ.400 కే ఫైబర్‌ టీవీ బేసిక్‌ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు తెలిపింది. ఏపీ సర్కిల్‌లో ఈ ప్లాన్‌ అందుబాటులో ఉందని తెలిపింది. ఈ ప్లాన్‌లో భాగంగా ట్రిపుల్ ప్లే సర్వీసులను అందించనున్నారు. అంటే బ్రాడ్‌బ్యాండ్‌, ల్యాండ్‌లైట్‌, టీవీ సదుపాయం ఉంటుంది.

BSNL RS400 Fiber basic plan

టీవీ, కాలింగ్‌, ఇంటర్నెట్‌ :
బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.400 ఫైబర్‌ టీవీ బేసిక్ ప్లాన్‌లో 400 లకు పైగా టీవీ ఛానళ్లు, 9 OTT సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చని BSNL తెలిపింది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ లోకల్‌, నేషనల్‌ కాల్స్ చేసుకోవచ్చు. మరియు 20 Mbps వేగంతో బ్రాడ్‌బ్యాండ్‌ ను ఉపయోగించుకోవచ్చు.

ఈ ఫైబర్‌ బేసిక్ ప్లాన్‌ కోసం ఆన్‌లైన్ లేదా సమీపంలోని BSNL కార్యాలయాలను సందర్శించాలని కోరింది. అయితే ప్రస్తుతం BSNL FTTH యూజర్లు కేవలం రూ.140 చెల్లించి.. ఈ ట్రిపుల్‌ ప్లే సర్వీసులను పొందవచ్చని సూచించింది. ప్రజలు వినియోగించుకోవాలని సూచించింది.

* స్వాతంత్ర్య దినోత్సరం సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆజాదీ కా ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రూ,1 రీఛార్జ్‌తో 30 రోజులపాటు అన్‌లిమిడెట్ కాల్స్‌, రోజువారీ 2GB డేటా, ప్రతిరోజు 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ కేవలం కొత్త యూజర్లను మాత్రమే వర్తిస్తుంది.

అంటే కొత్తగా సిమ్ కొనుగోలు చేసిన యూజర్లకు మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది. సిమ్‌ కార్డును ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్‌ ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి రాగా.. ఆగస్టు 31 వరకు ఉపయోగించుకోవచ్చు.

* అయితే ఇటీవలే జియో, ఎయిర్‌టెల్‌ సంస్థలు ఎంట్రీ లెవల్‌ ప్లాన్‌ను తొలగించాయి. జియో నిర్ణయం తీసుకొనే ఒక్కరోజులోనే ఎయిర్‌టెల్‌ కూడా అదే తరహా నిర్ణయం తీసుకుంది. జియో రూ.249 ప్లాన్‌ను తొలగించింది. గతంలో ఈ ప్లాన్‌ రోజువారీ 1GB డేటాను, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ SMS లను కూడా పొందవచ్చు.

ఈ ప్లాన్‌ను తీసివేయడంతో జియోలో రోజువారీ 1GB డేటాను అందించే ప్లాన్‌లు పూర్తిగా నిలిపివేసినట్లు అయింది. జియో యూజర్లకు రోజువారీ 1.5GB డేటా ప్లాన్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రోజువారీ డేటా అందించే ప్లాన్‌లు కావాలంటే యూజర్లు రూ.299 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ కలిగిన ప్లాన్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఎయిర్‌టెల్‌ కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. రూ.249 రీఛార్జ్‌ ప్లాన్‌ను పూర్తిగా నిలిపివేసింది. రోజువారీ డేటా కావాలంటే కనిష్ఠంగా రూ.299 లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన రీఛార్జ్‌ ప్లాన్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) పెంచుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL RS400 Fiber basic plan with internet, TV, calling benefits now available in AP Circle
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X