రూ.485 రీఛార్జ్ ప్లాన్‌తో 72 రోజుల వ్యాలిడిటీ, 2GB రోజువారీ డేటా.. 2 శాతం డిస్కౌంట్ కూడా..!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) నెట్‌వర్క్ మెరుగుపరచడం సహా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు యూజర్లను ఆకట్టుకొనేందుకు ప్రత్యేక ఆఫర్లు, ప్లాన్ లు, డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా ప్లాన్ ను తీసుకొచ్చింది. తాజాగా పండుగల సీజన్ సందర్భంగా అనేక రీఛార్జ్ ప్లాన్ లపై డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ ప్లాన్‌ల వివరాలు, పూర్తి ప్రయోజనాలు.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.485 రీఛార్జ్ ప్లాన్ :
తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ రూ.485 రీఛార్జ్ ప్లాన్ ను అప్‌గ్రేడ్ చేసింది. ఈ ప్లా్‌న్ లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతి రోజు 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు.

2 శాతం డిస్కౌంట్ :
ఈ రూ.485 రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 72 రోజులుగా ఉంటుందని BSNL తెలిపింది. అయితే బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్ కేర్ యాప్, వెబ్ సైట్ ద్వారా రూ.485 రీఛార్జ్ చేసుకుంటే 2 శాతం డిస్కౌంట్ ను అందిస్తున్నామని తెలిపింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 15 వ తేదీ నుంచి ప్రారంభం కాగా.. అక్టోబర్ 15 వ తేదీ వరకు ఉంటుందని తెలిపింది.
ఈ రెండు రీఛార్జ్ ప్లాన్‌లపైనా డిస్కౌంట్ :
దీంతోపాటు రూ.199, రూ.1999 రీఛార్జ్ ప్లాన్‌లపైనా 2 శాతం డిస్కౌంట్ ను అందిస్తున్నట్లు BSNL తెలిపింది. రూ.199 ప్లాన్ లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లు పొందవచ్చు. రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1999 రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు 1.5GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడీటీ 330 రోజులుగా ఉంటుందని సంస్థ తెలిపింది.
రేపే 4G లాంచ్! :
నెట్‌వర్క్ మెరుగుదల కోసం దేశవ్యాప్తంగా లక్ష 4G టవర్లను ఏర్పాటు చేసింది. గత సంవత్సరంలో రూ.25 వేల కోట్లను వెచ్చించింది. ఈ సంవత్సరం కూడా రూ.47 వేల కోట్లను ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని గతంలో తెలిపింది. రేపు సెప్టెంబర్ 27 వ తేదీన దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్ ను ప్రారంభించనుంది.
ఇందుకు సంబంధించిన టీజర్లను తమ X హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తోంది. రేపు స్వదేశీ డిజిటల్ భారత్ లో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందంటూ పోస్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తోంది. కనెక్టివిటీ అర్థాన్ని మారుస్తుందని బీఎస్‌ఎన్‌ఎల్ చెబుతోంది.
ఇటీవలే దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీ NCR లో బీఎస్‌ఎన్‌ఎల్ 4G నెట్‌వర్క్ ను తీసుకొచ్చింది. ఈ ప్రాంతంలోని యూజర్లు ఈ సేవలు పొందుతున్నట్లు సంస్థ తెలిపింది. సంబంధించిన సిమ్ కార్డులను బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ కేంద్రాలు, డీలర్ల నుంచి eKYC పూర్తి చేసి పొందవచ్చని తెలిపింది.


Click it and Unblock the Notifications








