క్రికెట్ అభిమానుల కోసం BSNL కొత్త ప్లాన్.. 90 రోజుల వ్యాలిడిటీతో..!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL క్రికెట్ ఫ్యాన్స్ కోసం సూపర్ రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. T20 వరల్డ్ కప్ సహా IPL 2026 ను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ప్లాన్ ను లాంచ్ చేసింది. X ప్లాట్‌ఫాం ద్వారా ఈ వివరాలను వెల్లడించింది. క్రికెట్ మ్యాచ్‌లతోపాటు సినిమాలు, వెబ్‌సిరీస్ సహా ఇతర కంటెంట్‌ను వీక్షించేలా అనేక ఓటీటీ ప్లాట్‌ఫాం సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది.
90 రోజుల వ్యాలిడిటీతో :
BSNL రూ.499 రీఛార్జ్ ప్లాన్ ను యాడ్ ఆన్ ప్లాన్ గా తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న రీఛార్జ్ ప్లాన్‌పై యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్, SonyLIV, Zee5 సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. ఒకేసారి మొబైల్, టీవీలో కంటెంట్‌ను వీక్షించేందుకు అవకాశం ఉంది.

ఒకేసారి రెండు డివైజ్‌లలో :
జియోహాట్‌స్టార్ లో క్రికెట్ మ్యాచ్‌లు, సోనీలివ్ లో ఫుట్‌బాల్ సహా ఇతర స్పోర్ట్స్ టోర్నమెంట్‌లు, అదే Zee5 లో సినిమాలు, షోలు సహా వెబ్‌సిరీస్‌లు అందుబాటులో ఉంటాయి. రెండు డివైజ్‌లలో ఒకేసారి వినియోగించుకొనేందుకు కూడా అవకాశం ఉంది.
ట్రాయ్ డిసెంబర్ 2025 నివేదిక :
టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తాజాగా 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన టెలికాం సబ్‌స్క్రైబర్ల డేటాను షేర్ చేసింది. గత కొన్ని నెలలగా యూజర్ల సంఖ్యపరంగా వృద్ధిని నమోదుచేసిన BSNL.. డిసెంబర్ నెలలో మాత్రం యూజర్లను కోల్పోయింది.
From last ball thrill to binge-worthy shows 🏏🎬
— BSNL India (@BSNLCorporate) February 9, 2026
Get live cricket & premium OTT content with BSNL Add-On Pack @ ₹499 for 3 months.
Watch on 2 screens simultaneously anytime, anywhere.
Say 'Hi' on WhatsApp 18004444 & Book now your FTTH Connection
#BSNLFiber #BSNL… pic.twitter.com/FtWwgH5rzO
మరో సంస్థ వోడాఫోన్ ఐడియా కూడా భారీగా యూజర్లను కోల్పోయింది. జియో, ఎయిర్‌టెల్ సంస్థలు మాత్రమే కొత్త యూజర్లను సంపాదించుకున్నాయి. అయితే డిసెంబర్ నెలలో ఎయిర్‌టెల్ భారీగా యూజర్లను సంపాదించుకుంది. తర్వాత స్థానంలో జియో ఉంది.
ట్రాయ్ వివరాల ఆధారంగా డిసెంబర్ నెలలో ఎయిర్‌టెల్ ఏకంగా 54.28 లక్షల మంది యూజర్లను సంపాదించుకుంది. అదే సమయంలో జియోలో 29.60 లక్షల మంది యూజర్లు కొత్తగా చేరారు. BSNL నుంచి 2.06 లక్షలు, వోడాఫోన్ ఐడియా (Vi) నుంచి ఏకంగా 9.04 లక్షల మంది ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయారు.
ట్రాయ్ రిపోర్టు ఆధారంగా ప్రస్తుతం 39.31 శాతం మార్కెట్ షేర్ తో జియో తొలి స్థానంలో ఉండగా.. 37.24 శాతం షేర్‌తో ఎయిర్‌టెల్ రెండో స్థానంలో ఉన్నాయి. తర్వాత స్థానాల్లో వోడాఫోన్ ఐడియా, BSNL ఉన్నాయి. దీంతోపాటు యాక్టివ్ సబ్‌స్క్రైబర్ల వివరాలు కూడా వచ్చాయి.
భారతీ ఎయిర్‌టెల్‌లో ఏకంగా 98.96 శాతం మంది యూజర్లు నెట్‌వర్క్‌ను నిరంతరం వినియోగిస్తున్నారు. అదే జియో లో ఆ శాతం 98.25 గా ఉంది. వోడాఫోన్ ఐడియాలో 85.30 శాతం యాక్టివ్ యూజర్లు ఉండగా.. BSNL లో కేవలం 58.23 శాతం మంది మాత్రమే ఉన్నారు.
దీంతో మరో ఆసక్తికర వివరాలు కూడా వెల్లడయ్యారు. కేవలం 2025 డిసెంబర్ నెలలో ఏకంగా 1.61 కోట్ల మంది యూజర్లు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ రిక్వస్ట్‌లు పంపినట్లు ట్రాయ్ తన రిపోర్టులో పేర్కొంది.


Click it and Unblock the Notifications








