Home
News

160 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్‌ కాలింగ్, 2GB డేటా రీఛార్జ్ ప్లాన్‌.. రూ.1000 కంటే తక్కువ ధరలోనే..!

BSNL వినియోగదారులను ఆకట్టుకొనేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం అనేక టెలికాం సర్కిల్స్‌లో కాల్‌ డ్రాప్‌ సహా ఇంటర్నెట్‌ స్పీడ్‌ సమస్యను ఎదుర్కొంటోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లక్ష 4G టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 84 వేలకు పైగా టవర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పింది. త్వరలోనే లక్ష టవర్ల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని బీఎస్‌ఎన్‌ఎల్‌ చెబుతోంది.

దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను మెరుగుపరుస్తూనే.. తక్కువ ధరలో మెరుగైన ప్రయోజనాలతో రీఛార్జ్‌ ప్లాన్‌లోను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫలితంగా యూజర్లను ఆకట్టుకోవాలని భావిస్తోంది. తాజాగా రెండు రీఛార్జ్ ప్లాన్‌లను లాంచ్‌ చేసింది.

BSNL Rs569 and Rs947 Recharge Plan offers best calling and data benefits news

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.569 రీఛార్జ్‌ :
ఈ ప్లాన్‌ గతంలో రూ.599 గా ఉండేది. ప్రస్తుతం రూ.569 ధరకు (BSNL Rs569 Recharge Plan) అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అంటే ఈ ప్లాన్‌లో మొత్తంగా 252GB డేటాను ఉపయోగించుకోవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటి, డేటా కావాలనుకొనే యూజర్లకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.

రూ.947 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌ గతంలో రూ.997 గా ఉండేది. ప్రస్తుతం రూ.947 కే (BSNL Rs947 Recharge Plan) అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లా్న్‌లో భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 160 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 320GB డేటాను వినియోగించుకోవచ్చు. ప్రతినెలా రీఛార్జ్ చేసేందుకు ఆసక్తి చూపని యూజర్లకు ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది.

దేశవ్యాప్తంగా త్వరలో BSNL 4G నెట్‌వర్క్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే 84 వేలకు పైగా 4G టవర్‌లను ఏర్పాటు చేసిన సంస్థ తెలిపింది. మే, జూన్‌ నెలల్లో మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. దీంతో గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా 4G నెట్‌వర్క్‌ను అందించవచ్చని భావిస్తోంది.

దీంతోపాటు జూన్‌ నెలలో 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే అవసరం అయిన టెస్టింగ్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. TCS భాగస్వామ్యంతో దేశీయంగా 4G టెక్నాలజీని అభివృద్ధి చేసింది. మరియు 4G నుంచి 5G అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు వీలుగా టెక్నాలజీని సమకూర్చుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో తొలుత బీఎస్‌ఎన్‌ఎల్‌ 5G నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానుంది. అనంతరం తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు. ఇప్పటికే తక్కువ ధరలకే రీఛార్జ్‌ ప్లాన్‌లను అందిస్తున్న BSNL సంస్థ, 5G నెట్‌వర్క్‌ కూడా అందుబాటులోకి వస్తే.. ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకొనే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Rs569 and Rs947 Recharge Plan offers best calling and data benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X