Home
News

BSNL Selfcare App బీఎస్‌ఎస్‌ఎల్‌ రూ.599 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌.. ఇలా చేస్తే 3GB అదనపు డేటా పొందవచ్చు..!

జులై నెలలో ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌- ఐడియా సంస్థలు భారీగా మొబైల్‌ టారిఫ్‌ల ధరలు పెంచాయి. దీంతో అనేక మంది యూజర్లు ప్రభుత్వ రంగ టెలికాం నెట్‌వర్క్ BSNL వైపు పోర్టింగ్‌ అవుతున్నారు. దీంతోపాటు తక్కువ ధరకే బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు అందిస్తుండడంతో BSNL (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌) వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G సేవలు దేశంలో ప్రారంభం కానున్నాయి. అయితే భారీగా పోర్టింగ్‌ అవుతున్న వినియోగదారుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే మెరుగైన రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.599 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్ ద్వారా తాజాగా అదనపు ప్రయోజనాలు అందించనుంది. ఈ బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్‌ ప్లాన్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 3GB డేటాను వినియోగించుకోవచ్చు.

BSNL RS599 Prepaid Recharge Plan

BSNL సెల్ఫ్‌ కేర్‌ యాప్‌ ద్వారా రూ.599 తో రీఛార్జ్‌ చేస్తే అదనంగా 3GB డేటాను పొందవచ్చు. ఇందుకోసం BSNL Selfcare యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం మీ బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ కావాలి. రీఛార్జ్ విభాగంలోకి వెళ్లి, రూ.599 ప్లాన్‌ను ఎంపిక చేసుకొని, పేమెంట్‌ చేయాలి. ఈ విధంగా చేస్తే అదనంగా 3GB డేటాను పొందవచ్చు.

దీంతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిట్‌ రీఛార్జ్ ప్లాన్ రూ.347 తో కూడా రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 54 రోజులుగా ఉంది. దీంతోపాటు అదనంగా 3GB డేటాను పొందవచ్చు. ఫలితంగా ఈ ప్లాన్‌లో భాగంగా 165GB డేటాను వినియోగించుకోవచ్చు.

BSNL ప్రస్తుతం ప్రధాన నగరాల్లో 4G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే 4G సిగ్నల్‌ రావడం లేదని తెలుస్తోంది. ఇందుకు కారణాలను సంస్థ తెలుసుకుంది. 4G సేవల కోసం BSNL కు 700MHz మరియు 2100MHz రెండు స్పెక్ట్రమ్ బ్యాండ్‌లను కేటాయించింది. అయితే ప్రారంభంలో వీటితోనే 4G నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. 2100MHz బ్యాండ్‌ పరిమిత సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంది. అందువల్ల కొంతమందికి మాత్రమే 4G కనెక్ట్‌ అయ్యేందుకు అవకాశం ఉంది.

ఇక 700MHz బ్యాండ్‌ ప్రాథమికంగా 5G నెట్‌వర్క్ కోసం కేటాయించారు. అయితే ప్రస్తుత మార్కెట్‌లో 700MHz స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌కు మద్దతిచ్చే మొబైల్‌లు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేదు. ప్రస్తుతానికి జియో మాత్రమే 700MHz బ్యాండ్‌ను పొందింది. కానీ ఇంకా 5G సేవల కోసం వినియోగించలేదు. ఇందుకు సంబంధించి టెలికాం మంత్రిత్వ శాఖ స్మార్ట్‌ఫోన్‌ సంస్థలకు సలహాలను జారీ చేసింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL RS599 Prepaid Recharge Plan gets additional 3GB Data via Selfcare App
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X