Home
News

276GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, 84 రోజుల వ్యాలిడిటీతో BSNL రీఛార్జ్‌ ప్లాన్‌.. 24వ తేదీ వరకు మాత్రమే..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కు ఇటీవల కాలంలో భారీగా ఆదరణ పెరిగింది. ప్రైవేటు టెలికాం సంస్థలు మొబైల్‌ రీఛార్జ్‌ ధరలను పెంచిన తర్వాత భారీ సంఖ్యలో వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్టింగ్‌ అయ్యారు. త్వరలో 4G సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులో రానుండడం, 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు సిద్ధం చేస్తుండడం, ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే మెరుగైన రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉండడంతో అధిక శాతం మంది మొబైల్‌ యూజర్లు BSNL నెట్‌వర్క్‌లో చేరుతున్నారు.

ఇప్పటికే BSNL అనేక మెరుగైన రీఛార్జ్‌ ప్లాన్‌లను కలిగి ఉంది. డేటా, వ్యాలిడిటీ ప్లాన్‌లను తక్కువ ధరకే అందిస్తోంది. BSNL రూ.599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ (BSNL RS599 Prepaid Recharge plan) ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. దీంతోపాటు ప్రమోషనల్‌ ఆఫర్‌లో భాగంగా అదనంగా 24GB డేటాను పొందవచ్చు.

BSNL RS599 Prepaid Recharge plan

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.599 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. ప్రొమోషనల్‌ ఆఫర్‌లో భాగంగా ఇవాళ్టి నుంచి అక్టోబర్ 24వ తేదీ మధ్యకాలంలో రీఛార్జ్‌ చేసిన వారికి 24GB డేటా అదనంగా లభిస్తుంది. ఈ 24GB డేటాను తొలి 24 రోజుల్లోనే వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ప్లాన్‌లో భాగంగా అందిస్తున్న రోజువారీ 3GB డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ వేగం 40kbps కు తగ్గిపోతుంది. మొత్తంగా ఈ ప్లాన్‌లో 252GB డేటాతోపాటు ఈ ఆఫర్‌ సమయంలో రీఛార్జ్‌ చేసుకుంటే అదనంగా 24GB డేటాను వినియోగించుకోవచ్చు. మొత్తంగా 276GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు BSNL ట్యూన్స్‌ సహా ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.

దీంతోపాటు BSNL రూ.485 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా ప్రస్తుతం 80 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. ప్లాన్‌ మొత్తంలో 160GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు అన్‌లిమిడెట్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు.

BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ రూ.399 ద్వారా 70 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 1GB డేటాను పొందవచ్చు. 1GB డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ వేగం 40kbps కు తగ్గుతుంది.

దీంతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.347 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 54 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయం ఉంది. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు డేటా పరంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ వేగం 40kbps కు తగ్గుతుంది.

ఇటీవలే BSNL వినియోగదారుల కోసం రూ.345 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. రోజువారీ 100 SMS లను, 1GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 60 రోజులుగా ఉంది. అయితే ఈ ప్లాన్‌లో BSNL ట్యూన్స్‌ సహా హార్డీ గేమ్స్‌ సదుపాయం లేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL RS599 Prepaid Recharge plan offers 3GB Daily Data with 84 days validity full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X