Home
News

105 రోజుల వ్యాలిడిటీ, రోజువారీ 2GB డేటాతో BSNL రీఛార్జ్ ప్లాన్‌.. పూర్తి వివరాలు..!!

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL తన వినియోగదారులను గణనీయంగా పెంచుకుంటోంది. ప్రైవేటు టెలికాం సంస్థ జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌-ఐడియా జులై నెలలో మొబైల్‌ టారిఫ్‌ ధరలను భారీగా పెంచాయి. దీంతోపాటు లక్షల మంది BSNL వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ఇతర సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే మెరుగైన కాలింగ్‌, డేటా ఇతర ప్రయోజనాలు అందిస్తోంది. త్వరలో పూర్తి స్థాయిలో 4G నె‌ట్‌వర్క్‌ అందుబాటులోకి రానుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.666 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా ఏకంగా 105 రోజులపాటు వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు BSNL (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌) వార్షికోత్సవం సందర్భంగా ప్రమోషనల్‌ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 24 వరకు రూ.500 కంటే ఎక్కువ రీఛార్జ్‌ ప్లాన్‌లపై 24GB అదనపు డేటాను పొందవచ్చు. ఈ డేటా వ్యాలిడిటీ 24 రోజులపాటు ఉంటుంది.

BSNL RS666 Prepaid Recharge Plan

BSNL రూ.666 రీఛార్జ్‌ ప్లాన్‌తో (BSNL RS666 Prepaid Recharge Plan) అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. డేటాపరంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. వ్యాలిడిటీ 105 రోజులుగా ఉంది. అంటే ప్లాన్‌ వ్యాలిడిటీలో మొత్తంగా 210GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు ఆఫర్‌లో భాగంగా 24GB డేటాను పొందవచ్చు.

BSNL రూ.599 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ప్లాన్‌లో భాగంగా 252GB డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రమోషనల్‌ ఆఫర్‌లో భాగంగా ఈనెల 24 తేదీలోపల రీఛార్జ్ చేసుకున్నవారికి 24GB డేటాను అందిస్తోంది.

BSNL రూ.485 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో అన్‌లిమిడెట్‌ కాలింగ్‌ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 80 రోజులుగా ఉంది. అంటే ప్లాన్‌ వ్యాలిడిటీలో మొత్తంగా 160GB డేటాను వినియోగించుకోవచ్చు.

BSNL రూ.397 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌తో 150 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా తొలి 30 రోజులపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 2GB డేటా, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. అయితే 150 రోజులపాటు ఇన్‌కమింగ్‌ కాల్‌ సదుపాయం ఉంది. సిమ్‌ కార్డును యాక్టివ్‌గా ఉంచేందుకు ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.347 రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 54 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. అదే రూ.345 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా 60 రోజులపాటు వ్యాలిడిటిని పొందవచ్చు. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను, 1GB డేటాను వినియోగించుకోవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
BSNL RS666 Prepaid Recharge Plan offers 2GB daily data with 105 days validity
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X