BSNL రూ.797 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో ఏకంగా 300 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి వివరాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కు ఇటీవల ఆదరణ భారీగా పెరుగుతోంది. ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా సంస్థ జులైలో మొబైల్ టారిఫ్ ధరలను పెంచింది. దీంతో అనేక మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్టింగ్ అవుతున్నారు. తాజాగా జులై నెలకు సంబంధించిన వివరాలను ట్రాయ్ వెల్లడించింది. ఈ వివరాల ఆధారంగా BSNL కు 29 లక్షల మంది కస్టమర్లు కొత్తగా చేరినట్లు తెలిపింది. అదే సమయంలో ఎయిర్‌టెల్ నుంచి 16 లక్షలు, వోడాఫోన్ ఐడియా నుంచి 14 లక్షలు, జియో నుంచి 7.5 లక్షల మంది నెట్‌వర్క్ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపింది.
BSNL ప్రస్తుతం అనేక మెరుగైన రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉంచింది. ప్రైవేటు టెలికాం నెట్‌వర్క్‌లతో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్ అత్యంత తక్కువ ధరకే సర్వీసులను అందిస్తోంది. తాజాగా రూ.797 రీఛార్జ్ ప్లాన్ (BSNL RS797 prepaid recharge plan) ద్వారా ఏకంగా 10 నెలలపాటు వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు మీకోసం.

BSNL రూ.797 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 300 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా తొలి 60 రోజులపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు తొలి 60 రోజులపాటు రోజువారీ 2GB డేటా, రోజువారీ 100 SMSలను వినియోగించుకోవచ్చు.
ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 300 రోజులుగా ఉంటుంది. అయితే ఈ ప్లాన్‌లో భాగంగా వస్తున్న ప్రయోజనాలు మాత్రం తొలి 60 రోజులపాటు మాత్రమే ఉంటాయి. సిమ్ కార్డును ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉంచేందుకు ఈ ప్లాన్ వినియోగపడుతుంది. BSNL ను రెండో సిమ్ కార్డుగా వినియోగిస్తున్న యూజర్లకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
BSNL రూ.599 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. డేటా పరంగా రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా అదనంగా 3GB డేటాను పొందవచ్చు.
BSNL రూ.997 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 160 రోజులపాటు వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. మొత్తంగా ఈ ప్లాన్‌లో భాగంగా 320GB డేటాను పొందవచ్చు.
BSNL రూ.1999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో మొత్తంగా 600GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ డేటాపై రోజువారీగా ఎటువంటి పరిమితి లేదు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








