Home
News

BSNL సిమ్‌ కార్డు 300 రోజులపాటు యాక్టివ్‌గా ఉండాలా.. ఈ తక్కువ ధర రీఛార్జ్‌ ప్లాన్‌ గురించి తెలుసుకోండి..!

BSNL గత ఆరు నెలలుగా భారీ సంఖ్యలో కొత్త యూజర్‌ లను సంపాదించుకుంటోంది. ప్రైవేటు టెలికాం సంస్థ గత సంవత్సరం జులైలో భారీగా మొబైల్‌ టారిఫ్‌ల ధరలను భారీగా పెంచాయి. దీంతో అనేక మంది BSNL లో చేరేందుకు ఆసక్తి చూపారు. తక్కువ ధరలో రీఛార్జ్‌ ప్లాన్‌ లు అందుబాటులో ఉండడం సహా త్వరలో 4G, 5G నెట్‌వర్క్‌ లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండడంతో కొత్త యూజర్‌ లు మొగ్గుచూపుతున్నారు.

ప్రస్తుతం BSNL (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌) తక్కువ ధరలోనే అనేక బెస్ట్‌ రీఛార్జ్ ప్లాన్‌ లను కలిగి ఉంది. అయితే 300 రోజులపాటు వ్యాలిడిటీని అందించే ప్లాన్ మరికొన్ని రోజులపాటు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇతర నెట్‌వర్క్‌ లతో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌ తక్కువ ధరకే 300 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది.

bsnl 300 days validity

BSNL రూ.797 ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ (BSNL Rs797 Recharge Plan) ద్వారా 300 రోజులపాటు వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్‌ లో భాగంగా తొలి 60 రోజులపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు వ్యాలిడిటీలో మొదటి 60 రోజులపాటు రోజువారీ 2GB డేటాను పొందవచ్చు.

అంటే మొత్తంగా 120GB డేటాను పొందవచ్చు. అయితే 60 రోజుల అనంతరం సిమ్‌ కార్డు యాక్టివ్‌ గా ఉంటుంది. 300 రోజుల వరకు ఇన్‌కమింగ్‌ కాల్ సదుపాయం ఉంటుంది. BSNL ను రెండో సిమ్‌ కార్డుగా ఉపయోగించే యూజర్లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్లాన్‌ ను ఫిబ్రవరి 10 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

BSNL రూ.797 రీఛార్జ్ ప్లాన్‌తో ఏకంగా 300 రోజులపాటు సిమ్‌ కార్డును యాక్టివ్‌గా ఉంచేందుకు అవకాశం ఉంటుంది. ఇదే తరహాలో BSNL మరో రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉంది. రూ.200 కంటే తక్కువ ధరలో ఏకంగా 70 రోజులపాటు వ్యాలిడిటీని అందిస్తోంది.

BSNL రూ.197 ప్రీపెయిడ్ రీఛార్జ్‌ ప్లాన్‌ తో (BSNL Rs197 Recharge Plan) 70 రోజులపాటు వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా తొలి 15 రోజులపాటు లోకల్‌, STD అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లతోపాటు రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. అంటే మొత్తంగా 30GB డేటాను పొందవచ్చు.

15 రోజుల అనంతరం ఈ ప్రయోజనాలు నిలిచిపోనున్నాయి. ఈ ప్లాన్‌లో మొత్తంగా 70 రోజుల వరకు సిమ్ కార్డు యాక్టివ్‌గా ఉంటుంది. BSNL ను రెండో సిమ్‌ కార్డుగా ఉపయోగించే వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. 15 రోజుల అనంతరం లోకల్‌ వాయిస్‌ కాల్స్‌ కోసం నిమిషానికి రూపాయి చెల్లించాల్సి ఉంటుంది.

BSNL రూ.397 ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ లో (BSNL Rs397 Recharge Plan) భాగంగా ఇదే తరహా ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్‌ తో మొదటి 30 రోజులపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. డేటా పరంగా 30 రోజులపాటు 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 150 రోజులుగా ఉంది.

అయితే తొలి 30 రోజులపాటు కాలింగ్‌, SMS, డేటా ప్రయోజనాలను పొందవచ్చు. అనంతరం 150 రోజుల వరకు ఇన్‌కమింగ్‌ కాల్‌ సదుపాయం మాత్రమే ఉంటుంది. అంటే రూ.400 కంటే తక్కువ ధరలో సుమారు 5 నెలలపాటు సిమ్ కార్డు యాక్టివ్‌ గా ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Rs797 Prepaid Recharge Plan offers 300 days validity and plan offered up to February 10 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X