Home
News

BSNL రీఛార్జ్‌ ప్లాన్‌ ద్వారా ఏకంగా 300 రోజుల వ్యాలిడిటీ.. రోజువారీ 2GB డేటా సహా ఇతర ప్రయోజనాలు..!

ప్రైవేటు టెలికాం సంస్థలకు పోటీగా BSNL ఎదిగేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 4G సర్వీసులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా శరవేగంగా టవర్లను ఏర్పాటు చేస్తోంది. లక్ష టవర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు తక్కువ ధరలో మెరుగైన సేవలు అందించేందుకు అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జులైలో ప్రైవేటు టెలికాం సంస్థలు మొబైల్‌ రీఛార్జ్‌ ధరలను పెంచాక.. అనేక లక్షల మంది యూజర్లు BSNL కు పోర్టింగ్‌ అయ్యారు. గతంలో ఇందుకు సంబంధించిన వివరాలను కూడా ట్రాయ్‌ (TRAI) వెల్లడించింది.

BSNL రూ.797 ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ :
ప్రస్తుతం BSNL రూ.797 ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ ద్వారా ఏకంగా 300 రోజులపాటు వ్యాలిడిటీని పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, SMS లు సహా డేటా ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే సిమ్‌ కార్డును యాక్టివ్‌గా ఉంచేందుకు ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది.

BSNL RS797 Prepaid Recharge plan

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.797 ప్లాన్‌ ద్వారా 300 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో భాగంగా మొదటి 60 రోజులపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు డేటా పరంగా తొలి 60 రోజులపాటు రోజువారీ 2GB డేటాను పొందవచ్చు.

సిమ్‌ కార్డు యాక్టివ్‌గా ఉంచేందుకు :
BSNL ను సెకండ్‌ సిమ్‌ కార్డుగా వినియోగిస్తున్న యూజర్లకు ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది. ఏకంగా 300 రోజులపాటు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను పొందవచ్చు. బ్యాంకింగ్‌, ఆధార్ వంటి సేవలతో మీ మొబైల్‌ నంబర్‌ రిజిస్టర్‌ అయితే అందుకు సంబంధించిన మెసెజ్‌లను అందుకొనేందుకు సిమ్‌ కార్డు యాక్టివ్‌గా ఉండాల్సి ఉంటుంది.

BSNL రూ.599 రీఛార్జ్‌ ప్లాన్‌ లో రోజువారీ 3GB డేటాను పొందవచ్చు. మరియు ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. ప్లాన్ మొత్తంలో 252GB డేటాను పొందవచ్చు. ప్రమోషనల్‌ ఆఫర్‌లో భాగంగా అదనంగా 24GB డేటా ను పొందవచ్చు. దీంతోపాటు BSNL ట్యూన్స్‌ సహా ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.

ఏకంగా 320GB డేటాను పొందవచ్చు :
అదే BSNL రూ.997 ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయం సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు డేటా పరంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 160 రోజులుగా ఉంది. ఫలితంగా ప్లాన్‌లో భాగంగా మొత్తంగా 320GB డేటాను పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL RS797 Prepaid Recharge plan offers 300 days validity with daily data full benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X