Home
News

180 రోజుల వ్యాలిడిటీ, 90GB డేటాతో రీఛార్జ్ ప్లాన్‌.. పూర్తి ప్రయోజనాల వివరాలు..!

ప్రభుత్వ రంగ సంస్థ BSNL గత సంవత్సరం రెండో భాగం బాగా కలిగి వచ్చింది. జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా వంటి సంస్థలు భారీగా మొబైల్‌ రీఛార్జ్‌ల ధరలు పెంచాయి. దీంతోపాటు అసంతృప్తికి గురైన యూజర్లు భారీ సంఖ్యలో BSNL కు పోర్టింగ్ అయ్యారు. దీంతోపాటు కొన్ని నెలల వరకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు యూజర్లు క్యూ కట్టారు. తక్కువ ధరకే రీఛార్జ్‌ ప్లాన్‌లు అందుబాటులో ఉండడం, త్వరలో 4G, 5G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తుందనే ప్రకటనలతో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ వైపు మొగ్గు చూపారు.

చాలా సంవత్సరాల తర్వాత లాభాలు :
ఇలా అనేక కారణాలతో సుమారు 17 సంవత్సరాల తర్వాత BSNL లాభాల్లోకి వచ్చింది. అయితే నెట్‌వర్క్ సమస్యలు, స్లో ఇంటర్నెట్‌, కాల్‌ డ్రాప్‌ వంటి అనేక కారణాలతో యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు పోర్టింగ్‌ అపుతున్నారు. దీంతో యూజర్లను ఆకట్టుకొనేందుకు అనేక కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

BSNL Rs897 Recharge plan

బీఎస్‌ఎన్‌ఎన్‌ రూ.897 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ :
బీఎస్‌ఎన్‌ఎన్‌ రూ.897 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ (BSNL Rs897 Recharge Plan) ద్వారా ఏకంగా 180 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ప్రతినెల రీఛార్జ్‌లతో విసిగిపోయే యూజర్లకు ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు.

ఇందులో ఢిల్లీ, ముంబైలోని MTNL నెట్‌వర్క్‌ యూజర్లకు కూడా అన్‌లిమిటెడ్ కాల్స్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 90GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ డేటాపై రోజువారీ వినియోగంపై ఎటువంటి లిమిట్‌ లేదు. ఈ డేటా వినియోగం అనంతరం ఇంటర్నెట్‌ వేగం 40kbps గా ఉంటుంది.

ఈ ప్లాన్‌లో భాగంగా డేటా, కాలింగ్ ప్రయోజనాలతోపాటు ఇతర ఓటీటీ ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కలిగిన రీఛార్జ్‌ ప్లాన్‌ కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుంది. రూ.897 ప్లాన్‌ 180 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. అంటే రోజువారీ సుమారు రూ.5 మాత్రమే చెల్లిస్తున్నట్లుగా ఉంటుంది.

* బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.397 రీఛార్జ్ ప్లాన్‌ కూడా ఎక్కువ వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ లోకల్‌, STD కాల్స్ సదుపాయాన్ని పొందవచ్చు. MTNL కాలింగ్ కూడా చేసుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ కాలింగ్‌, డేటా, SMS ప్రయోజనాలను కేవలం 30 రోజుల వరకు మాత్రమే పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 150 రోజులుగా ఉంటుంది. 30 రోజుల అనంతరం ఇన్‌కమింగ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు ఇతర ప్రయోజనాలకు కూడా అందిస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ మే - జూన్‌ నాటికి లక్ష 4G టవర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 80 వేలకు టవర్ల నిర్మాణం జరిగింది. ఈ రెండు నెలల్లో మిగిలిన టవర్ల నిర్మాణం జరగనుంది. జూన్‌ నుంచి 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించనున్నారు. ఢిల్లీలో తొలిదశలో 5G నెట్‌వర్క్‌ ప్రారంభం కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Rs897 Recharge plan offers 180 days validity and 90 GB Data, calling and sms benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X