BSNL రూ.997 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్.. 160 రోజుల వ్యాలిడిటీ, 320GB డేటా..!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ప్రస్తుతం లక్షల మంది వినియోగదారులను తమ వైపు తిప్పుకుంటోంది. జులై నెలలో ప్రైవేటు టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, జియో, వోడాఫోన్ ఐడియా ధరల పెంపుతో అసంతృప్తిగా ఉన్న అనేక మంది యూజర్లు BSNL వైపు పోర్టింగ్ అవుతున్నారు. దీంతోపాటు ఇతర సంస్థలతో పోలిస్తే తక్కువ ధరలకే సర్వీసులు అందిస్తుండడంతో బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ ను ఎంచుకుంటున్నారు. త్వరలో 4G నెట్ వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. 5G నెట్‌వర్క్‌ను కూడా వీలైనంత వేగంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం BSNL అనేక మెరుగైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లను కలిగి ఉంది. BSNL రూ.997 రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఏకంగా 160 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్‌లిమిడెట్ కాలింగ్ సహా SMS లను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ లో భాగంగా రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. మొత్తంగా 320GB డేటాను వినియోగించుకోవచ్చు.

ఇదే ధరలో ఇతర టెలికాం సంస్థలు కూడా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లను కలిగి ఉన్నాయి. అయితే ఆయా సంస్థలు కేవలం 84 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తున్నాయి. అదే BSNL 160 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. ఇదే తరహాలో BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) మరిన్ని రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది.
BSNL రూ.1999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో 365 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా ఏకంగా 600GB డేటాను పొందవచ్చు. ఈ డేటాను వినియోగించుకొనేందుకు ఎటువంటి రోజువారీ పరిమితులు లేవు. అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.
దీంతోపాటు BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.2399 తో 395 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. దీంతోపాటు హలో ట్యూన్స్ సహా ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.
BSNL రూ.229 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 30 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అన్ లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను అందిస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగా రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. అంటే ప్లాన్ వ్యాలిడిటీలో 60GB డేటాను పొందవచ్చు. 2GB డేటాతో, 30 రోజుల వ్యాలిడిటీని కేవలం తక్కువ ధరకే BSNL అందిస్తోంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








