కాలింగ్ కోసమే BSNL సిమ్ కార్డును వినియోగిస్తుంటే.. 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ మీ కోసమే..!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL వినియోగదారులను మరింతగా ఆకట్టుకొనేందుకు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రైవేటు టెలికాం సంస్థల రీఛార్జ్ ధరల పెంపుతో భారీగా కొత్త యూజర్లను పొందుతున్న బీఎస్‌ఎన్‌ఎల్.. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఇతర సంస్థలతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది.
BSNL 4G నెట్‌వర్క్ వచ్చే సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం శరవేగంగా 4G టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా మెరుగైన సేవలు అందించే విధంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఏర్పాటు చేస్తోంది. దీంతోపాటు జూన్ 2025 నాటికి 5G సేవలను ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తోంది.

BSNL ఇటీవలే కొత్త లోగోను ఆవిష్కరించింది. దీంతోపాటు నేషనల్ వైఫై రోమింగ్ సేవలు సహా D2D సేవలను ప్రారంభించింది. దీంతోపాటు లైవ్ టీవీ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో BSNL లైవ్ టీవీ అందుబాటులోకి రాలేదు.
అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 200 రోజుల వ్యాలిడిటీ :
తాజాగా BSNL రూ.999 ధరతో (BSNL RS999 Recharge Plan) ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ఏకంగా 200 రోజులపాటు వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే డేటా, SMS ప్రయోజనాలను ఈ ప్లాన్ ద్వారా పొందలేదు.

కేవలం కాలింగ్ కోసమే BSNL సిమ్ కార్డును వినియోగిస్తుంటే మాత్రం ఈ ప్లాన్ మీకు సౌకర్యంగా ఉంటుంది. లేకుంటే రెండో సిమ్ కార్డుగా BSNL ను వినియోగిస్తున్నా గానీ ఈ ప్లాన్ మీ అవసరాలను తీరుస్తుంది. ఇతర ప్రైవేటు టెలికాం నెట్‌వర్క్‌లు ఈ తరహా రీఛార్జ్ ప్లాన్‌ను అందించడం లేదు.
అన్ని ప్రయోజనాలతో 160 రోజుల వ్యాలిడిటీ :
దీంతోపాటు BSNL RS997 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ (BSNL RS997 Recharge Plan) ద్వారా 160 రోజులపాటు వ్యాలిడిటీని అందిస్తోంది. కాలింగ్‌తోపాటు డేటా, SMS అవసరాలు కూడా ఉన్న యూజర్లు.. ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాలింగ్‌తోపాటు రోజువారీ 2GB డేటాతోపాటు 100 SMS లను వినియోగించుకోవచ్చు.
ప్రైవేటు టెలికాం సంస్థలు సుమారు రూ.1,000 ధరలో అందుబాటులో ఉన్న ప్లాన్‌లలో కేవలం 90 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తున్నాయి. అయితే అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 1.5GB నుంచి 2GB డేటాను అందిస్తున్నాయి. దీంతోపాటు రోజువారీ 100 SMS లను అందిస్తున్నాయి. దీంతోపాటు ఉచితంగా హలో ట్యూన్స్‌ను కూడా పొందవచ్చు.
అదే రూ.1198 రీఛార్జ్ ప్లాన్‌తో BSNL సంవత్సరం పాటు వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా ప్రతి నెల 300 నిమిషాలపాటు కాలింగ్ చేసుకోవచ్చు. మరియు నెలవారీ 3GB డేటా సహా 30 SMS లను వినియోగించుకోవచ్చు. సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవడం సహా కాల్స్, డేటా, SMS లను పరిమితంగా ఉపయోగించుకొనేవారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








