BSNL యొక్క 14 ప్రీపెయిడ్ ప్లాన్‌లు సవరించబడ్డాయి!! వివరాలు ఇవిగో

|

భారత ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL తన యొక్క వినియోగదారులకు అందిస్తున్న ప్రస్తుత ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్‌లన్నింటినీ తన ఆపరేషనల్ టెలికాం సర్కిల్స్‌లో సవరించినట్లు ప్రకటించింది. పాన్ ఇండియా ప్రాతిపదికన దాదాపు 14 ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్‌ల బేస్ టారిఫ్‌ను ఆపరేటర్ సవరించినట్లు ప్రకటించింది. వాయిస్ కాల్‌లు, వీడియో కాల్‌లు, డేటా ఛార్జీలు, SMS ఛార్జీలు మరియు వాయిస్, డేటా మరియు SMS సిరీస్‌ల కోసం ఇంటర్‌ సర్కిల్ రోమింగ్ ఛార్జీల టారిఫ్ ఛార్జీల సవరణ ఇందులో ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

కొత్తగా సవరించబడ్డ BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు

కొత్తగా సవరించబడ్డ BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు

ప్రభుత్వ టెల్కో యొక్క తాజా టారిఫ్ రివిజన్ కింద BSNL ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్‌లలో రూ.152, రూ.199, రూ.197, రూ.399, రూ.397, రూ.485, రూ.666, రూ.699, రూ.999, రూ.997, రూ.1499, రూ.1999, రూ.2399 మరియు FRC 249 ధరల వద్ద లభించే ప్లాన్ వోచర్లు ఉన్నాయి. ఈ 14 ప్లాన్‌లలో రూ.997 వోచర్ ప్లాన్ ప్రస్తుతం ప్రతి నిమిషం టారిఫ్‌లో ఉంది. ఇది సెకను ప్రాతిపదికగా సవరించబడుతుంది. ఇతర ప్లాన్‌లు కూడా టారిఫ్‌లో నిమిషానికి అందుబాటులో ఉంటాయి.

ప్లాన్ వాలిడిటీ

ఇప్పటి వరకు పైన పేర్కొన్న ప్రీపెయిడ్ ప్లాన్‌లకు ప్లాన్ వాలిడిటీ లేదా ఫ్రీబీలలో ఎలాంటి మార్పులు ఉండవని ప్రకటించబడింది. అయితే టారిఫ్ మాత్రమే మార్చబడుతుంది మరియు ఇది బేస్ టారిఫ్‌కు వర్తిస్తుంది. ఇవి కాకుండా BSNL ఛార్జ్ చేయదగిన షార్ట్ కోడ్‌లకు అవుట్‌గోయింగ్ SMS సేవలను పొందడానికి కనీస రీఛార్జ్ స్టేటస్ ని కూడా సవరించింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కొత్త మరియు ఇప్పటికే ఉన్న ప్రీపెయిడ్ మొబైల్ చందాదారులకు వర్తిస్తుంది. ఈ కొత్త మార్పు MRP రూ.147 మరియు అంతకంటే ఎక్కువ ఉన్న ప్రీపెయిడ్ వోచర్‌లను మాత్రమే ఛార్జ్ చేయదగిన షార్ట్ కోడ్‌లకు అవుట్‌గోయింగ్ SMS సౌకర్యాన్ని పొందడానికి అనుమతిస్తుంది.

BSNL ప్రమోషనల్ ప్లాన్‌లు

BSNL ప్రమోషనల్ ప్లాన్‌లు

BSNL టెల్కో సెప్టెంబర్ 6, 2021 నుండి కొత్తగా ప్రమోషనల్ ప్లాన్‌లను ప్రారంభిస్తుంది. గ్రేస్ పీరియడ్‌లో చందాదారులు తమ నంబర్లను రీఛార్జ్ చేయడం ద్వారా నెట్‌వర్క్‌ను చురుకుగా ఉపయోగించుకునేలా ప్రోత్సహించడానికి టెల్కో ఇన్‌కమింగ్ SMS సదుపాయాన్ని వెస్ట్ మరియు నార్త్ జోన్లలోని ప్రీపెయిడ్ మొబైల్ కస్టమర్లకు మాత్రమే అందిస్తుంది. ఇది వారి చెల్లుబాటు గడువు ముగిసిన తర్వాత రీఛార్జ్ చేయని వారికి SMS లను స్వీకరించే సదుపాయాన్ని నిలిపివేస్తుంది. ఇది దక్షిణ మరియు తూర్పు జోన్లలోని వినియోగదారులకు వర్తిస్తుంది. నార్త్ మరియు వెస్ట్ జోన్ యూజర్లు ప్రమోషనల్ ప్రాతిపదికన 60 రోజుల గ్రేస్ పీరియడ్ కోసం ఇన్కమింగ్ SMS సదుపాయాన్ని ఆస్వాదించవచ్చు. రీఛార్జ్ చేయడానికి మరియు యాక్టివ్ కస్టమర్‌లుగా మారడానికి ప్రోత్సహించడానికి VLR లో GP2 కస్టమర్‌లు అయితే ఇతరులు కూడా దీనిని ఆస్వాదించవచ్చు.

BSNL STV 1,498 ప్లాన్ ప్రయోజనాలు

BSNL STV 1,498 ప్లాన్ ప్రయోజనాలు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెల్కో పాన్-ఇండియా ప్రాతిపదికన రూ.1500 ధరలోపు వినియోగదారుల కోసం కొత్తగా ప్రత్యేక టారిఫ్ వోచర్ (STV) ని విడుదల చేసింది. STV 1,498 ధర వద్ద లభించే ఈ ప్లాన్ 1 సంవత్సరం చెల్లుబాటుతో వస్తుంది. ఈ STV యొక్క ప్రత్యేక విషయం అది అందించే ప్రయోజనాలు. వినియోగదారులు ఈ వోచర్‌తో 2GB రోజువారీ డేటాను పొందుతారు మరియు ఫెయిర్-యూసేజ్-పాలసీ (FUP) డేటా వినియోగం తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40 Kbps కి పడిపోతుంది. సంవత్సరం దీర్ఘకాల చెల్లుబాటుతో పాటు చౌకైన ధర వద్ద ప్రీపెయిడ్ ప్లాన్‌ల కోసం చూస్తున్న వ్యక్తులకు ఈ వోచర్ సరైనది.

BSNL రూ.1,999 ప్లాన్‌లో మార్పులు

BSNL రూ.1,999 ప్లాన్‌లో మార్పులు

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ టెల్కో మార్పులు చేసిన వాటిలో రూ.1,999 ప్లాన్‌ కూడా ఉంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 100GB అదనపు డేటాను కూడా పొందుతారు. ఈ ప్లాన్ కూడా 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇంకా ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS లతో పాటుగా లోక్‌ధన్ కంటెంట్ మరియు ఈరోస్ నౌ సబ్‌స్క్రిప్షన్‌ని ఉచితంగా పొందవచ్చు. ఇంతకుముందు ఈ కంపెనీ ఈ ప్లాన్‌తో 500GB సాధారణ డేటాను అందించేది కానీ ఇప్పుడు అది మొత్తంగా 600GB డేటాను అందిస్తుంది. అయితే FUP డేటా వినియోగం తర్వాత వినియోగదారులు డేటాను 80 Kbps వేగంతో బ్రోజ్ చేయడానికి అనుమతిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL's 14 Prepaid Plans Have Been Revised: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X