డేటా పరిమితిని పెంచిన BSNL, 90 రోజుల వ్యాలిడిటీతో..

Written By:

టెలికాం రంగంలో దిగ్గజాలతో పోటీపడుతున్న ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ Happy Offer పేరుతో సరికొత్త ప్లాన్ ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్లో మీకు 90 రోజులతో కూడిన అదనపు డేటా లభిస్తుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. సెలెక్టడ్ ఫ్రీపెయిడ్ కష్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా ఇంతకుముందున్న 43 శాతం డేటాకు బదులుగా 50 శాతం డేటాను BSNL వినియోగదారులు అందుకుంటారు.

ఏపీ, తెలంగాణలో Airtel అందిస్తున్న మొత్తం డేటా ప్లాన్లు, రూ.9 నుంచి రూ.3999 దాకా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.485, రూ. 666 ప్లాన్

రూ.485 ప్లాన్ ద్వారా 90 రోజుల పాటు కష్టమర్లు రోజుకు 1.5 జిబి డేటా చొప్పున అందుకుంటారు. దీంతో పాటు unlimited local, STD and roaming calls ఉచితంగా లభిస్తాయి.
అలాగే మరో ప్లాన్ రూ. 666 ద్వారా 129 రోజులు పాటు 1.5 జిబి డేటా చొప్పున యూజర్లు అందుకుంటారు. వారికి 129 రోజులు పాటు unlimited local, STD and roaming calls వస్తాయి.

రూ. 186, రూ. 187 ప్లాన్

దీంతో పాటు సెలక్ట్ యూజర్లకు రూ. 186, రూ. 187 ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు రోజుకు 1జిబి డేటా చొప్పున 28 రోజుల పాటు అపరిమిత కాల్స్ తో కూడిన ఆఫర్ పొందవచ్చు.
ఇక ఇంకో ప్లాన్ రూ. 349 ద్వారా యూజర్లు 54 రోజుల పాటు రోజుకు 1జిబి డేటా చొప్పున పొందవచ్చు. unlimited local, STD and roaming calls ఉచితంగా లభిస్తాయి.

మరో ప్లాన్ రూ. 429 ద్వారా రోజుకు 1 జిబి డేటా చొప్పున 81 రోజులు పాటు పొందవచ్చు. unlimited local, STD and roaming calls ఉచితంగా లభిస్తాయి.

రిలయన్స్ జియో

కాగా రిలయన్స్ జియో తన ప్రతి రీచార్జ్ పై రూ. 50 తగ్గింపును అందించిన విషయం అందరికీ తెలిసిందే దీనితో పాటు డేటా పరిమితిని కూడా యూజర్లకు పెంచింది. ఈ ఆపర్లు ఇలా ఉంటే క్యాష్ బ్యాక్ ఆఫర్లతో మరో సరికొత్త యుధ్దానికి తెరలేపిన సంగతి తెలిసిందే. జియో యూజర్లు చేసుకునే రీఛార్జ్ లపై 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందించనుంది. 398 రూపాయలు, ఆపై మొత్తాల రీఛార్జ్‌లపై మొత్తం 700 రూపాయల వరకు అంటే 100 శాతానికి పైగా క్యాష్‌బ్యాక్‌ను పొందనున్నట్టు జియో పేర్కొంది.

ఎయిర్‌టెల్

ఇక ఎయిర్‌టెల్ కూడా సరికొత్త రూట్లో ముందుకుదూసుకువెళుతోంది. జియోకి పోటీగా తన వినియోగదారులను కాపాడుకునేందుకు డేటా పరిమితిని పెంచింది. రూ. 349 ఎయిర్‌టెల్ ప్లాన్ లో రోజుకు 2జిబి డేటా వ్యాలిడిటీ 28 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తోంది. రూ. 448 ప్లాన్ రోజుకు 1 జిబి డేటా వ్యాలిడిటీ 70 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తోంది.

అమెజాన్‌ ప్రైమ్‌ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్‌..

ఇదిలా ఉంటే ఎయిర్‌టెల్ ఈ మధ్యనే పోస్టుపెయిడ్‌, వీ-ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లకు తమ టీవీ యాప్‌ డౌన్‌లోడ్‌పై ఏడాది పాటు ఉచితంగా అమెజాన్‌ ప్రైమ్‌ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రమోషనల్‌ ఆఫర్‌ అంతకముందు కేవలం కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది.

వొడాఫోన్

ఇక వొడాఫోన్ కూడా సరికొత్త ఆఫర్లతో దూసుకొచ్చిన సంగతి తెలిసిందే.
రూ.199 ప్లాన్
ఈ ప్లాన్‌లో భాగంగా వొడాఫోన్‌ తన కస్టమర్లకు రోమింగ్‌తో పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజూ 1జీబీ 3జీ/4జీ డేటాను అందిస్తుంది. కాగా ఈ ఆఫర్ కేవలం వొడాఫోన్‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు మాత్రమే. ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులు
రూ.229 ప్లాన్
రోజుకు 1జీబీ డేటా, అపరమిత కాల్స్‌, ఉచిత రోమింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 28 రోజుల పాటు ఆఫర్‌ చేస్తుంది. అయితే ఈ ప్లాన్‌ కేవలం వొడాఫోన్‌ కొత్త యూజర్లకు మాత్రమేనని వొడాఫోన్ ఓ ప్రకటనలో తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL’s new ‘Happy Offer’: 1.5GB per day data with 90 days validity for Rs 485 More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot