రూ.299కే 45జిబి డేటా..BSNL బ్రాడ్‌బ్యాండ్ కొత్త ప్లాన్..!
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ రంగంలో సవాల్ విసిరేందుకు రెడీ అయిన సంగతి అందరికీ తెలిసిందే.
టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ రంగంలో సవాల్ విసిరేందుకు రెడీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ రంగంలో కూడా ప్రభంజనం సృష్టించేందుకు ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలో దిగ్గజ టెల్కోలు అన్నీ ఇప్పటినుంచే దాన్ని ఎదుర్కునేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా BSNL రిలయన్స్ జియోకు గిగా ఫైబర్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు సరికొత్త రూ.299 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను తీసుకొచ్చింది.

రూ.299 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్...
రూ.299 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో కస్టమర్లకు 45 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. దీనికి 30 రోజుల వాలిడిటీ ఉంటుంది.రోజు వారి డేటా ముగిసే వరకు ఇంటర్నెట్ స్పీడ్ గరిష్టంగా 8 ఎంబీపీఎస్ వరకు వస్తుంది. తరువాత స్పీడ్ తగ్గుతుంది. అప్పుడు కస్టమర్లకు కేవలం 1 ఎంబీపీఎస్ స్పీడ్ మాత్రమే వస్తుంది. దీంతో పాటు అపరిమిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్లాన్ ను తీసుకునే యూజర్ కు రూ. 50 క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

BSNL లేటెస్ట్ గా తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను సవరించింది అవేంటో చూడండి....
రూ. 675 ప్లాన్....
రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 675 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 5GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ తీసుకునే యూజర్ నెలకు 150GB డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ భారతదేశం లోపల ఏదైనా నెట్వర్క లో అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు (స్థానిక + STD) అందిస్తుంది.

రూ. 845 ప్లాన్...
రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 845 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 10GB డేటాను అందిస్తుంది.ఈ ప్లాన్ తీసుకునే యూజర్ నెలకు 300GB డేటా పొందవచ్చు.

రూ. 999 ప్లాన్...
రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 845 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 15GB డేటాను అందిస్తుంది.

రూ. 1,199 ప్లాన్...
రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 1,199 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 20GB డేటాను అందిస్తుంది.

రూ. 1,495 ప్లాన్...
రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 1,199 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 25GB డేటాను అందిస్తుంది.

రూ. 1,745 ప్లాన్...
రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 1,745 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 30GB డేటాను అందిస్తుంది.

రూ. 2,295 ప్లాన్...
రివైజ్ చేసిన BSNL BBG కాంబో ULD 1,745 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 10Mbps స్పీడ్ తో రోజుకు 35GB డేటాను అందిస్తుంది.


Click it and Unblock the Notifications