BSNL యూజర్లకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి 93,450 4G టవర్లు.. జూన్‌లో 5G ట్రయల్స్..!
BSNL యూజర్లు అనేక మంది నెట్‌వర్క్, కాల్ డ్రాప్, డేటా వేగం తక్కువగా ఉండడం వంటి అనేక కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ సమస్యలు అన్నింటికీ అతి త్వరలోనే ఫుల్‌స్టాప్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే త్వరలో పూర్తిస్థాయిలో BSNL 4G నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది. 4G నెట్‌వర్క్ కోసం దేశవ్యాప్తంగా లక్ష టవర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంస్థ.. వేగంగా వాటిని ఇన్‌స్టాల్ చేస్తోంది.
93,450 4G టవర్లు :
తాజాగా అందుబాటులోకి వచ్చిన వివరాల ఆధారంగా దేశవ్యాప్తంగా 93,450 4G టవర్లు పనిచేస్తున్నాయి. లక్ష టవర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే BSNL యూజర్లకు ఉన్న అనేక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. జూన్ చివరి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని ఇప్పటికే సంస్థ వెల్లడించింది.

గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో :
BSNL 4G పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని యూజర్లకు మెరుగైన నెట్‌వర్క్ ను ఉపయోగించుకొనేందుకు వీలుంటుంది. దీంతోపాటు అనేక మంది యూజర్లు తిరిగి బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ లోకి వచ్చే అవకాశం ఉంది.
5G ట్రయల్స్ :
4G నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చాక.. అతి త్వరలోనే 5G ను ప్రారంభించాలని భావిస్తోంది. జూన్ నెల నుంచి 5G ట్రయర్స్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో BSNL CMD రాబర్ట్ రవి చెప్పిన వివరాల ఆధారంగా తొలుత ఢిల్లీలో BSNL 5G అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరియు వీలైనంత వేగంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు.
BSNL లాభం రూ.280 కోట్లు :
గత కొన్ని సంవత్సరాలుగా నష్టాలు చూసిన BSNL ఇటీవల కాలంలో లాభాల బాటలో నడుస్తోంది. మార్చి 31, 2025 తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో సంస్థ రూ.280 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటన చేసింది. మూడో త్రైమాసికంలోనూ రూ.262 కోట్లు లాభాలు వచ్చినట్లు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ గతంలోనే వెల్లడించింది.
బీఎస్‌ఎన్‌ఎల్ అనుకున్న సమయానికి 4G, 5G నెట్‌వర్క్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి యూజర్లు క్యూ కట్టే అవకాశం ఉంది. గత సంవత్సరం ప్రైవేటు నెట్‌వర్క్స్ భారీగా రీఛార్జ్ ధరలను పెంచాయి. దీంతో అనేక బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌లోకి పోర్టింగ్ అయ్యారు.
అయితే అనంతర కాలంలో బీఎస్ఎన్ఎల్ లో నెట్‌వర్క్ సమస్యలు సహా ఇతర కారణాలతో అనేక మంది ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి మెరుగైన నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తే.. తక్కువ రీఛార్జ్ ధరల కారణంగా భారీ సంఖ్యలో బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది.
BSNL 4G నెట్‌వర్క్‌ను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇందుకోసం టాటా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. మరియు 4G నుంచి సులభంగా 5G నెట్‌వర్క్ కు అప్‌గ్రేడ్ అయ్యేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇందులో భాగంగానే లక్ష టవర్లను ఏర్పాటు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








