దూకుడు పెంచిన BSNL, జియోతో పోటీకి రె‘ఢీ’!

రిలయన్స్ జియోను ఎదుర్కొనేుందుకు తాము సర్వం సిద్ధమని ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) మంగళవారం ప్రకటించింది. మార్కెట్లో నిలబడాలంటే టారిఫ్ ఛార్జీల విషయంలో పోటీపడక తప్పదని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.

Read More : చేతిలో పేలిన Jio LYF స్మార్ట్‌ఫోన్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

కొత్త వినియోగదారులను ఆకర్షించే క్రమంలో బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్రమోషనల్ అన్‌లిమిటెడ్ వై‌ర్‌లైన్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌తో ముందుకొచ్చిన విషయం తెలసిందే.

#2

ఈ ప్లాన్‌లో భాగంగా రూ.249 చెల్లించి నెల మొత్తం మీద 300జీబి ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు. రిలయన్స్ జియో, 1జీబి ఇంటర్నట్‌ను రూ.50కు ఆఫర్ చేస్తోన్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఈ అన్‌లిమిటెడ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది.

#3

ఈ పథకాన్ని వినియోగదారుడు పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే 1జీబి డేటాకు రూపాయి మాత్రమే చెల్లించినట్లు అవుతుందని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ శ్రీవాస్తవ తెలిపారు.

#4

జియోతో పాటు ఇతర టెలికామ్ ఆపరేటర్లను ధీటుగా ఎదుర్కొనేందుకు మరింత పోటీతత్వంతో ముందుకు సాగుతామని, ఈ క్రమంలో టారిఫ్ ప్లాన్‌ల విషయంలో పోటీ వాతావరణం తప్పదని ఆయన తెలిపారు.

#5

ల్యాండ్‌లైన్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే అనేక ఆఫర్లను అందించటం జరుగుతోంది. ఇందులో నైట్ కాలింగ్ ఆప్షన్ కూడా ఒకటి. ఈ ఆప్షన్‌లో భాగంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు, ఆదివారాలు మాత్రం పూర్తిగా రోజంతా ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశాన్ని బీఎస్ఎన్ఎల్ కల్పిస్తోంది.

#6

జియో 4జీకి పోటీగా బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే నేషన్‌వైడ్ అన్‌లిమిటెడ్ 3జీ మొబైల్ డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో భాంగా రూ.1,099 చెల్లించినట్లయితే 30 రోజుల పాటు 3జీ డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు.

#7

రిలయన్స్ జియో ఆఫర్ చేస్తోన్న ఉచిత వాయిస్ కాల్స్‌ను రెండు మూడు నెలలు పరిశీలించి, ఆ ప్రభావాన్ని బట్టి తాము కూడా కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకువస్తామని శ్రీవాస్తవ తెలిపారు.

#8

Experience Unlimited BB 249 పేరుతో బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేయబోతోన్న ప్రమోషనల్ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ సెప్టంబర్ 9 నుంచి అమలులోకి రానుంది.

#9

ఈ ప్లాన్‌లో భాగంగా రూ.249 చెల్లించి నెల మొత్తం మీద 300జీబి ఇంటర్నెట్‌ను 2 Mbps వరకు వేగంతో అపరిమితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

#10

ఒక్కో కనెక్షన్‌కు 6 నెలల పాటు వర్తించే ఈ ఆఫర్‌లో భాగంగా 1జీబి డేటాను రూపాయి కన్నా తక్కువ మొత్తానికి బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేయనుంది. 6 నెలలు పూర్తి అయిన తరువాత కస్టమర్ తన ఛాయిస్‌ను బట్టి రెగ్యులర్ ప్లాన్‌కు మైగ్రేట్ కావల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL says will match Reliance Jio in tariff. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot