Home
News

BSNLలో చేరాలనుకుంటున్నారా.. ఈ సీక్రెట్ ప్లాన్లతో వందల రూపాయలు మిగిలించుకోవచ్చు...!!

BSNL: ప్రైవేట్ టెలికాం కంపెనీలు రేట్లు పెంచేశాయి కదా.. అందుకే చాలా మంది ఇప్పుడు BSNL వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇది తక్కువ ధరకే బెస్ట్ ప్లాన్స్ ఇస్తోంది. పైగా BSNL 4G నెట్‌వర్క్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవుతోంది. దేశమంతా దాదాపు లక్ష 4G టవర్లు పెట్టే పనిలో ఉన్నారు. ఈ సంవత్సరం చివరికి 75 వేల టవర్లు రెడీ అయిపోతాయ్. అంటే ఇక నెట్‌వర్క్ గురించి బెంగే అక్కర్లేదు.

ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా (Vi) లాంటి కంపెనీలు చార్జీలు పెంచడంతో చాలామంది యూజర్లు BSNLలోకి మారిపోతున్నారు. తక్కువ ధరలో మంచి ప్లాన్స్ కావాలంటే BSNL ఇప్పుడు హాట్ ఛాయిస్. మీరు కూడా కొత్తగా BSNL 4G సిమ్ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే మీకు కచ్చితంగా తెలియాల్సిన రెండు ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ (FRC) ఇక్కడ ఉన్నాయి.

BSNL Secret Plans Revealed

* BSNL 4G ఎందుకు బెస్ట్ ఆప్షన్..

BSNL ఇప్పుడు నెమ్మదిగా టెలికాం మార్కెట్లో దూసుకుపోతోంది. కారణం సింపుల్ తక్కువ ధరకే అదిరిపోయే ప్లాన్స్, ఇంప్రూవ్ అయిన నెట్‌వర్క్ సర్వీసులు. అందుకే చాలా మంది BSNLని నమ్ముతున్నారు. కొత్త కస్టమర్ అయినా, పాత కస్టమర్ అయినా.. BSNLలో తక్కువ బడ్జెట్‌లో ప్లాన్స్ ఉన్నాయి, అలాగే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఇచ్చే ప్లాన్స్ కూడా ఉన్నాయి.

* ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ (FRC) అంటే..

కొత్త BSNL 4G సిమ్ తీసుకున్నప్పుడు, దాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఫస్ట్ రీఛార్జ్ (FRC) ప్లాన్ అనేది కచ్చితంగా చేసుకోవాలి. ఇది మాండేటరీ స్టెప్ అన్నమాట. FRC ప్లాన్ లేకుండా మీ సిమ్ పనిచేయదు. అందుకే మీకోసం రెండు బెస్ట్ FRC ప్లాన్స్ ఇక్కడ ఉన్నాయి. చూసేయండి మరి.

* BSNL FRC108 ప్లాన్

తక్కువ ధరలో BSNL 4G స్టార్ట్ చేయాలనుకునే లైట్ యూజర్లకు ఈ ప్లాన్ మంచి ఆప్షన్. ఇందులో కాలింగ్ బెనిఫిట్స్ చూస్తే ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్‌గా ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకి 1GB డేటా లభిస్తుంది. లిమిట్ దాటితే స్పీడ్ 40 Kbpsకి పడిపోతుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.

ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ 28 రోజుల పాటు ఫ్రీ BSNL ట్యూన్స్. ఈ ప్లాన్‌లో పరిమితులు చూస్తే SMS బెనిఫిట్స్ లేవు. ఈ ప్లాన్ నుంచి వేరే ప్లాన్‌కి మారడానికి కుదరదు. మీకు తక్కువ కాల్స్, లిమిటెడ్ డేటా ఉంటే సరిపోతుంది అనుకుంటే ఈ ప్లాన్ బెస్ట్.

* BSNL FRC249 ప్లాన్..

ఎక్కువ డేటా, ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కావాలనుకుంటే ఈ ప్లాన్ మీ కోసమే. అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఏ నెట్‌వర్క్‌ యూజర్‌తోనైనా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ముంబై, ఢిల్లీలో MTNL నెట్‌వర్క్‌కు కూడా వర్తిస్తుంది. రోజుకి 2GB డేటా. లిమిట్ దాటితే స్పీడ్ 40 Kbps స్పీడ్‌తో ఇంటర్నెట్ వాడుకోవచ్చు.

SMS: రోజుకి 100 SMSలు ఇస్తాయి. దీని వ్యాలిడిటీ 45 రోజులు. అలాగే ఈ ప్లాన్ నుంచి కూడా వేరే ప్లాన్‌కి మారడానికి కుదరదు. మీకు ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ కావాలంటే ఈ ప్లాన్ ని హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు.

* ఈ FRC ప్లాన్స్ ఎందుకు అంత ముఖ్యం?

FRC ప్లాన్ లేకుండా మీ BSNL 4G సిమ్ పనిచేయదు. అంతేకాదు, ఈ ప్లాన్స్ మీ అవసరాలకు తగ్గట్టుగా తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్స్ ఇస్తున్నాయి. మీరు లైట్ యూజరైతే, బేసిక్ ప్లాన్ కావాలంటే FRC 108ని ఎంచుకోండి. ఎక్కువ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, ఎక్కువ వ్యాలిడిటీ కావాలంటే FRC 249 ప్లాన్‌ బెస్ట్.

చూశారుగా, BSNL ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఎంత బాగున్నాయో. ఇతర టెలికాం సంస్థల FRCలతో పోలిస్తే వీటి ధరలు చాలా తక్కువ. దాదాపు వంద రూపాయలు వీటితో మనం సేవ్ చేసుకోవచ్చు. తక్కువ ధరలో సూపర్ బెనిఫిట్స్ తో మీ టెలికాం జర్నీని స్టార్ట్ చేయడానికి ఇవి బెస్ట్ ఆప్షన్స్.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Secret Plans Revealed Save Hundreds on Your Mobile Bill
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X