జీతాలు చెల్లించలేమంటూ చేతులెత్తేసిన BSNL,కంపెనీ పరిస్థితి ఏంటీ ?

By Gizbot Bureau
|

ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కథ కంచికేనా? ఇకపై కార్యకలాపాలు కొనసాగించం కష్టమేనా? నేడు కంపెనీ ఉన్న పరిస్థితుల్లో మనుగడ కష్టమేనా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. BSNL కంపెనీ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. జీతాలు చెల్లించలేమంటూ చేతులెత్తేసింది. ఈ మేరకు పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి BSNL కంపెనీకి చెందిన ఇంజినీర్స్, అకౌంటెంట్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కోరింది.

BSNL seeks immediate help from govt, says difficult to pay salary

సంస్థకు తక్కువ స్థాయిలో అప్పులు ఉన్నాయని, మార్కెట్ వాటా కూడా క్రమంగా పెరుగుతోందని, నగదు కొరత కారణంగా సంస్థ కార్యకలాపాలు, సర్వీసుల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని సంస్థకు బడ్జెట్ పరంగా మద్దతివ్వాలని కోరింది. కేంద్రం సహకరించకుంటే జూన్ నెల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు అని తెలిపింది. బాకీలు వేల కోట్లు ఉన్నందున వేతనాల కోసం రూ.850 కోట్లు సేకరించడం కష్టమన్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

ప్రభుత్వం ఆదుకోవాలి

ప్రధానికి రాసిన లేఖలో సంస్థ పరిస్థితిని వివరించింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక మద్దతు లభిస్తే ప్రస్తుతం ఉన్న నగదు కొరత సమస్య తీరుతుందని పేర్కొంది. దీంతో బీఎస్ఎన్ఎల్ తిరిగి లాభాలబాట పడుతుందని తెలిపింది. ఉద్యోగుల పనితీరు ఆధారిత విధానాన్ని అమలు చేయాలని, దీంతో మంచి పనితీరు కనబరిచిన వారికి ప్రతిఫలం అందుతుందని, జవాబుదారీతనం పెరుగుతుందని పేర్కొంది. ప్రయివేటు రంగంలోని టెలికం సంస్థల నుంచి పోటీ ఎదురుకావడంతో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లు చాలాకాలం నష్టాలు చవిచూశాయి.

కంపెనీకి రూ.13,000 కోట్ల అప్పులు

కంపెనీకి రూ.13,000 కోట్ల అప్పులు

కంపెనీకి రూ.13,000 కోట్ల రుణాలు ఉన్నాయి. ఖర్చుకు తగిన ఆదాయం రావడం లేదు. ఎక్కువ నష్టాలను నమోదు చేస్తున్న ప్రభుత్వరంగ సంస్థల్లో బీఎస్ఎన్ఎల్ టాప్‌లో ఉందట. కొటక్ ఇనిస్టిట్యూషన్స్ ఈక్విటీ నివేదిక ప్రకారం... డిసెంబర్ 2018 నాటికి నిర్వహణ నష్టాలు రూ.90,000 కోట్లకు పైగా ఉన్నాయి. ఇలాగే ఉంటే కంపెనీ నిర్వహణ, ఉద్యోగులకు రూ.850 కోట్ల వేతనాలు కష్టమని చెబుతున్నారు. వీలైనంత త్వరగా నిధులు అందించి ఆదుకోవాలని కోరింది. లేనిపక్షంలో కార్యకలాపాలు నిర్వహించడం కష్టమేనని పేర్కొంటోంది.

చివరిసారి నెట్ ప్రాఫిట్ రూ.575 కోట్లు

చివరిసారి నెట్ ప్రాఫిట్ రూ.575 కోట్లు

చివరిసారి 2008-09లో బీఎస్ఎన్ఎల్ నెట్ ప్రాఫిట్ రూ.575 కోట్లుగా ఉంది. 2013-14లో బీఎస్ఎన్ఎల్ రెవెన్యూ రూ.26,153 కోట్లు కాగా, నష్టం రూ.7,020 కోట్లు, 2014-15లో రెవెన్యూ రూ.27,242 కోట్లు, నష్టం రూ.8,234 కోట్లు, 2015-16 రెవెన్యూ రూ.28,381, నష్టం రూ.4,859, 2016-17లో రెవెన్యూ రూ.28,404 కోట్లు, నష్టం రూ.4క,793 కోట్లు, 2017-18లో రెవెన్యూ రూ.22,668 కోట్లు, నష్టం రూ.7,993 కోట్లుగా ఉంది. మొత్తంగా 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి డెబిట్స్ రూ.14,000 కోట్లుగా ఉన్నాయి.

 తక్షణ నిధుల సాయం లేకుండా..

తక్షణ నిధుల సాయం లేకుండా..

నెలవారీ ఆదాయం, ఖర్చుల మధ్య వ్యత్యాసం ఎక్కువగానే ఉందని, ఈ నేపథ్యంలో తక్షణ నిధుల సాయం లేకుండా కార్యకలాపాలు కొనసాగించడం దాదాపు అసాధ్యం' అని బీఎస్ఎన్ఎల్ కార్పొరేట్ బడ్జెట్ అండ్ బ్యాంకింగ్ డివిజన్ సీనియర్ జనరల్ మేనేజర్ పురాన్ చంద్ర తెలిపారు. ఈ విషయమై టెలికం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఇందులోనే తదుపరి కార్యాచరణ గురించి కూడా సూచనలు కోరారు.

ఉద్యోగుల వేతనాలు, బెనిఫిట్స్ ఎక్కువ

ఉద్యోగుల వేతనాలు, బెనిఫిట్స్ ఎక్కువ

అయితే బీఎస్ఎన్ఎల్‌కు సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి పునరుద్ధరణ చర్యలు లేవని అంటున్నారు. ఉద్యోగి వేతనాలు, బెనిఫిట్స్ ఎక్కువగా ఉండటం, పేలవమైన నిర్వహణ పనితీరు, 4G నెట్ వర్క్ విస్తరణలో జాప్యం వంటి అంశాలు కంపెనీని దెబ్బతీశాయని అంటున్నారు. ప్రయివేటు టెలికం కంపెనీలు 4G సేవల్లో దూసుకెళ్తూ, 5Gపై దృష్టి సారిస్తుంటే, బీఎస్ఎన్ఎల్ ఇంకా 3Gలోనే ఉంది. ఇప్పుడిప్పుడే 4G సేవలు అందిస్తోంది. ఈ కంపెనీలో 1.7 లక్షలమంది ఉద్యోగులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సహకారం లేకుంటే నడపటం కష్టతరమని కంపెనీ అసోసియేషన్ ఆందోళన చెందుతోంది. ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చు 2018లో (రిటైర్మెంట్ ఉద్యోగులు సహా) 66 శాతంగా ఉండటం గమనార్హం. ఇది 2006లో 21 శాతం మాత్రమే ఉంది. అదే సమయంలో ఎయిర్‌టెల్ 3 శాతం ఖర్చు చేస్తోంది.

కంపెనీని దెబ్బతీసిన కారణాలు

కంపెనీని దెబ్బతీసిన కారణాలు

కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక ప్రకారం ఎక్కవ నష్టాలను నమోదు చేస్తున్న ప్రభుత్వ రంగ కంపెనీల జాబితాలో బీఎస్ఎన్ఎల్ టాప్‌లో ఉంది. 2018 డిసెంబర్ చివరి నాటికి కంపెనీ నిర్వహణ నష్టాలు ఏకంగా రూ.90,000 కోట్లు దాటాయి. అయితే బీఎస్ఎన్ఎల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పునరుద్ధరణ సూచనలు కానీ సలహాలు కానీ లభించడం లేదు. ఉద్యోగి వ్యయాలు ఎక్కువగా ఉండటం, పేలవమైన నిర్వహణ పనితీరు, మధ్యమధ్యలో కేంద్ర ప్రభుత్వ జోక్యం, 4జీ నెట్‌వర్క్ విస్తరణలో జాప్యం వంటి అంశాలు కంపెనీని దెబ్బతీశాయని చెప్పుకోవచ్చు.

 4జీ వచ్చినా 3జీలోనే

4జీ వచ్చినా 3జీలోనే

ప్రైవేట్ టెలికం కంపెనీలు 4జీ సహా కొత్త సాంకేతికతతో దూసుకెళ్తోంటో బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 3జీలోనే ఉంది. ఇప్పుడిప్పుడే 4జీ సేవలు అందిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం 5జీ స్పెక్ట్రమ్ వేలానికి రెడీ అవుతుండటం గమనార్హం. ప్రభుత్వ రం సంస్థకు కేంద్రం నుంచి సరైన సహాయం లేకపోవడం విడ్డూరమే. కంపెనీలో దాదాపు 1.7 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి ప్రకటనా రాలేదు.

Best Mobiles in India

English summary
BSNL seeks immediate help from govt, says difficult to pay salary

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X