షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL..!
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా 97 వేలకు పైగా 4G టవర్లను ప్రారంభించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 4G టెక్నాలజీని సమకూర్చుకుంది. దీంతోపాటు యూజర్లను ఆకట్టుకొనేందుకు దీపావళి సందర్భంగా తీసుకొచ్చిన దీపావళి బొనంజా ఆఫర్ ఈ నెల 15వ తేదీ వరకు అందుబాటులో ఉంది. అయితే బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటీవల రూ.147 రీఛార్జ్ ప్లాన్ లో గతంలో 10GB డేటాను అందించేది. ప్రస్తుత 5GB డేటాను మాత్రమే అందిస్తోంది. తాజాగా రూ.197, రూ.197, రూ.319, రూ.439, రూ.599, రూ.897, రూ.997, రూ.1499 రీఛార్జ్ ప్లాన్‌ల వ్యాలిడిటీని తగ్గించింది. దీంతోపాటు మరిన్ని మార్పులు చేసింది.

రూ.197 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (BSNL Rs197 Recharge Plan) భాగంగా గతంలో 54 రోజుల వ్యాలిడిటీని అందించేది. ప్రస్తుతం 48 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగా ప్రస్తుతం 300 నిమిషాల లోకల్/STD కాలింగ్ తోపాటు 100 SMS లను అందిస్తోంది. దీంతోపాటు 4GB డేటాను అందిస్తోంది.
రూ.319 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (BSNL Rs319 Recharge Plan) గతంలో 65 రోజుల వ్యాలిడిటీని అందించేది. ప్రస్తుతం 60 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాన్ లో అన్‌లిమిటెడ్ కాలింగ్, మొత్తంగా 300 SMS లను అందిస్తోంది. దీంతోపాటు 10GB డేటాను అందిస్తోంది.
రూ.439 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (BSNL Rs439 Recharge Plan) భాగంగా గతంలో 90 రోజుల వ్యాలిడిటీని అందించేది. ప్రస్తుతం 80 రోజుల వ్యాలిడిటీని మాత్రమే BSNL అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాన్ లో అన్‌లిమిటెడ్ కాలింగ్, మొత్తంగా 300 SMS లను మాత్రమే పొందవచ్చు.
రూ.599 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (BSNL Rs599 Recharge Plan) భాగంగా గతంలో 84 రోజుల వ్యాలిడిటీని అందించేది. ప్రస్తుతం కేవలం 70 రోజుల వ్యాలిడిటీనే అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాన్ లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లు, రోజువారీ 3GB డేటాను పొందవచ్చు.
రూ.897 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (BSNL Rs897 Recharge Plan) భాగంగా గతంలో 160 రోజుల వ్యాలిడిటీని అందించేది. ప్రస్తుతం 150 రోజుల వ్యాలిడిటీనే అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాన్ లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 2GB డేటాను అందిస్తోంది.
రూ.1499 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (BSNL Rs1499 Recharge Plan) భాగంగా గతంలో 336 రోజుల వ్యాలిడిటీని అందించేది. ప్రస్తుతం 300 రోజుల వ్యాలిడిటీనే BSNL అందిస్తోంది. ఈ ప్లాన్ లో ప్రస్తుతం అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజువారీ 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు మొత్తంగా 30GB డేటాను అందిస్తోంది.


Click it and Unblock the Notifications








