ప్రైవేట్ టెల్కోలకు పోటీగా BSNL!! భారీ మార్పులతో సర్వం సిద్ధం కానున్నదా...

|

భారతదేశంలో దాదాపు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం అధికమవుతుండడంతో ప్రతి వినియోగదారుడు కూడా మెరుగైన మొబైల్ నెట్‌వర్కింగ్ అనుభవాన్ని కోరుకుంటున్నారు. టారిఫ్‌ల ధరలు పెరగడంతో దేశంలోని టెలికాం ఆపరేటర్లు అన్ని కూడా తమ యొక్క వినియోగదారుల అంచనాలను పెంచుతున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కూడా ప్రస్తుతం దేశం మొత్తం మీద 4G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొనిరావడం కోసం పని చేస్తోంది. అయితే దీని పోటీదారులు ప్రైవేట్ టెలికాం సంస్థలైన భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మరియు రిలయన్స్ జియో వంటివి ఇప్పటికే 5G లాంచ్ కోసం సిద్ధమవ్వడమే కాకుండా స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం వేచి ఉన్నాయి.

 

4G నెట్‌వర్క్‌

దేశంలో స్వదేశీ టెక్నాలిజీతో 4G నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న ఏకైక టెలికాం సంస్థ BSNL మాత్రమే. దేశంలో 4G నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత కంపెనీకి అధికంగా ప్రయోజనం లభిస్తుంది. ప్రస్తుత దారుణమైన స్థితి నుండి కోలుకోవడానికి BSNL 4Gతో వినియోగదారులకు స్థిరమైన నెట్‌వర్క్ అనుభవాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నది. 2023 చివరి నాటికి BSNL యొక్క 4G మరియు 5G నెట్‌వర్క్‌లు భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో అందుబాటులోకి రానున్నాయి.

BSNL వేగంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి?

BSNL వేగంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి?

BSNL 4G నెట్‌వర్క్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకొనివచ్చి ప్రస్తుత ధరలతోనే స్థిరంగా కొత్త సబ్‌స్క్రైబర్‌లను జోడించగలిగితే మరియు ఇప్పటికే ఉన్న వారిని నిలబెట్టుకోగలిగితే కనుక దాని ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. BSNL ప్రారంభంలో ARPU గురించి చింతించకూడదు. వినియోగదారులను జోడించడం కోసం టెల్కో దాని వ్యూహాలతో దూకుడుగా ఉండాలి. దానికి గల ఏకైక మార్గం ధరలను పెంచకుండా ఇప్పటికే గల అతి తక్కువ టారిఫ్‌లను అందించడం కొనసాగించడం.

BSNL
 

BSNL దాని నెట్‌వర్క్‌లతో వినియోగదారులను ఆకర్షించడానికి ఇతర టెల్కోలు అందించే 4G మరియు తాను అందించే 4G మధ్య భేదం చూపుతూ దాని స్వదేశీ పరిష్కారాలను ఉపయోగించాల్సి ఉంటుంది. BSNL కూడా గొప్ప కస్టమర్ సపోర్ట్ అనుభవాన్ని అందించడం ద్వారా కస్టమర్లను గెలుచుకోగలదు. ప్రైవేట్ టెల్కోలతో ఉన్న చాలా మంది వినియోగదారులకు కంపెనీ కస్టమర్ కేర్ టీమ్‌తో పరస్పర చర్యల అనుభవం మెరుగ్గా ఉంది. BSNL కూడా కస్టమర్ కేర్ టీమ్‌తో ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించగలిగితే కనుక అది టెల్కోకు పెద్ద విజయం అవుతుంది.

 BSNL 4G నెట్‌వర్క్‌

5G గురించి పెద్దగా చింతించకుండా BSNL 4G నెట్‌వర్క్‌లను వీలైనంత వేగంగా విస్తరించాలి. స్వదేశీ 5G టెక్నాలజీ విస్తరణ కోసం C-DoT (సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్) నేపథ్యంలో కొన్ని ఇతర భారతీయ సంస్థలు కలిసి పనిచేసే అవకాశం ఉంది. BSNL యొక్క ముఖ్య ఉద్దేశం తన యొక్క వినియోగదారులకు ప్రైవేట్ టెల్కోలతో పొందే దాని కంటే మెరుగైన కవరేజీని అందించడం.

ఒక నెల వాలిడిటీతో 3GB/రోజుకి డేటాతో BSNL ప్రీపెయిడ్ ప్లాన్

ఒక నెల వాలిడిటీతో 3GB/రోజుకి డేటాతో BSNL ప్రీపెయిడ్ ప్లాన్

BSNL టెల్కో ఒక నెల పూర్తి వాలిడిటీతో అందించే ప్రీపెయిడ్ ప్లాన్ రూ.299 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో స్వల్పకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంద. దీనితో వినియోగదారులు 3GB రోజువారీ డేటాను పొందుతారు. అంటే వినియోగదారులు మొత్తం చెల్లుబాటు కాలంలో 90GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. FUP డేటా వినియోగించబడిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 80 Kbpsకి తగ్గించబడుతుంది. డేటా ప్రయోజనంతో పాటు వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. ప్రైవేట్ టెల్కోలు అదే ధర వద్ద అందిస్తున్న ప్లాన్ లతో పోలిస్తే ఇది అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్. BSNL టెల్కో రూ.500 ధరలోపు అందించే జాబితాలోని మొదటి ప్లాన్ STV_399. ఇది 80 రోజుల చెల్లుబాటు కాలానికి అపరిమిత వాయిస్ కాల్‌లతో పాటు రోజుకు 1GB డేటాను మరియు 100 SMS/రోజుకు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అదనంగా BSNL ట్యూన్‌లు మరియు లోక్‌ధున్ కంటెంట్‌కు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. జాబితాలోని తదుపరి STV_429 ప్లాన్ కొంచెం మెరుగైన ప్రయోజనాలతో లభిస్తుంది. ఇది రోజుకు 81 రోజుల చెల్లుబాటుతో రోజుకు 1GB డేటా, అపరిమిత వాయిస్ కాల్‌లు మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. అదనపు ప్రయోజనాలలో ఇది Eros Now ఎంటర్‌టైన్‌మెంట్ సేవలకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది.

బడ్జెట్‌ను అదుపులో ఉంచే BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు

బడ్జెట్‌ను అదుపులో ఉంచే BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు

వినియోగదారులు మీ యొక్క సెకండరీ సిమ్ కోసం బడ్జెట్‌ను అదుపులో ఉంచుకుంటూ బడ్జెట్ ధరలో లభించే ప్లాన్ కోసం చూస్తున్న వినియోగదారులకు BSNL యొక్క STV_49 ప్లాన్ ఒక గొప్ప ఎంపిక. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 1GB డేటా మరియు 100 నిమిషాల వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను 20 రోజుల చెల్లుబాటు కాలానిక పొందుతారు. ఇది భారీ డేటా ప్లాన్ కాదు కానీ తమ సెకండరీ సిమ్ ను ఎప్పటికి యాక్టీవ్ లో ఉంచాలనుకునే వ్యక్తులకు సరైన ఎంపిక అవుతుంది. బడ్జెట్ ధరలో అధిక మొత్తంలో డేటా కోసం చూస్తున్న వినియోగదారుల కోసం BSNL టెల్కో STV_87 మరొక ప్లాన్ ని అందిస్తున్నది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజుకు మరియు 1GB రోజువారీ డేటా ప్రయోజనాలను 14 రోజుల సర్వీస్ వాలిడిటీ కాలానికి పొందుతారు. FUP డేటా వినియోగం పూర్తి అయిన తరువాత డేటా స్పీడ్ 40 Kbpsకి తగ్గుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
BSNL Should Do This to Compete With Private Telcos Airtel, Vi and Jio

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X