60 రోజుల పాటు రోజుకు 2జీబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్

BSNL Sixer పేరుతో సరికొత్త రూ.666 ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ అనౌన్స్ చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్‌లు రూ.666 పెట్లి రీఛార్జ్ చేసుకున్నట్లయితే రోజుకు 2జీబి డేటాతో పాటు 60 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. బీఎస్ఎన్ఎల్ యూజర్లు గతకొంత కాలంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్లాన్ కోసం ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా లాంచ్ అయిన ఈ ప్యాక్‌ ద్వారా ఆ కొరత తీరినట్లయ్యింది.

60 రోజుల పాటు రోజుకు 2జీబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్

రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు ధీటుగా బీఎస్ఎన్ఎల్ ఇటీవలే రూ.444 చౌకా ప్లాన్ ను మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్ ఇతర టెల్కోలకు చుక్కులు చూపించేలా ఉంది. బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న చౌకా ప్లాన్ లో మాత్రం రూ.444 చెల్లించినట్లయితే రోజుకు 4జీబి 3జీ డేటా అందుబాటులో ఉంటుంది.

60 రోజుల పాటు రోజుకు 2జీబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్

రూ.444 చెల్లించి చౌకా ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకునే బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లు ఏకంగా 90 రోజుల పాటు ప్లాన్ బెనిఫిట్స్‌ను ఆస్వాదించే వీలుంటుంది. అంటే 90 రోజుల పాటు రోజుకు 4జీబి చొప్పున 3జీ డేటాను పొందే వీలుంటుంది. బీఎస్ఎన్ఎల్ రూ.444 చౌకా ప్లాన్‌లో ఎటువంటి వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ ఉండవు. ఇది కేవలం డేటా సెంట్రిక్ ప్లాన్ మాత్రమే.

English summary
BSNL Sixer 666 Plan Announced; Offers 2GB Data Per Day and Unlimited Voice Calls for 60 Days. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot