BSNL నుంచి 40Mbps స్పీడ్ తో కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ విడుదల!

|

భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ఇటీవల వినియోగదారుల కోసం కొత్త 40 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు, ఈ ప్లాన్ కొత్త ఆఫర్ అయినప్పటికీ, BSNL Bharat Fibre ఆఫర్‌లలో ఇప్పటికే ఉన్న 30 Mbps ప్లాన్‌కి దీనికి మధ్య పెద్ద వ్యత్యాసం ఏం లేదు. BSNL ప్రస్తుతం రూ.500 ధరలో బహుళ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఈ రోజు, మేం కంపెనీ నుండి కొత్తగా ప్రవేశపెట్టిన 40 Mbps ప్లాన్‌పై గురించి మీకు వివరించబోతున్నాం. ఈ ప్లాన్ ప్రయోజనాలు ఏంటి.. ఇంకా ఇతర వివరాలను తెలుసుకుందాం.

BSNL

40 Mbps స్పీడ్ బ్రేక్‌డౌన్‌తో BSNL కొత్త రూ.499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్;
BSNL కొత్తగా ప్రవేశపెట్టిన ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్, భారతి ఎయిర్‌టెల్ యొక్క ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ అందించే 40 Mbps ప్లాన్‌ను చాలా పోలి ఉంటుంది. కానీ ఎయిర్‌టెల్ మరియు BSNL యొక్క ఈ ప్లాన్‌లో చిన్న పాటి తేడాలు ఉంటాయి. మేము ఇటీవల Airtel మరియు BSNL యొక్క రెండు రూ.499 ప్లాన్‌ల మధ్య పోలికల్ని జాబితా చేసాము. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

BSNL Bharat Fibre నుండి రూ.499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో వినియోగదారులు పొందే మొత్తం ప్రయోజనాలను జాబితా చేద్దాం:
BSNL యొక్క 40 Mbps లేదా రూ. 499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో 40 Mbps వేగంతో ఇంటర్నెట్ పొందుతారు. అదేవిధంగా, మొత్తం 3.3TB డేటా అందుతుంది. వీటితో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా అందిస్తున్నారు. నిర్ణీత డేటా ముగిసిన తర్వాత నెట్ వేగం 4 Mbps కి పడిపోతుంది.

BSNL యొక్క 40 Mbps లేదా రూ. 499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో మీరు పొందేది ఇదే. మీరు దీన్ని ఇతర ISPల (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లు) ఆఫర్‌లతో పోల్చినట్లయితే, ఇది రీజనబుల్ ధరలో అద్భుతమైన ప్రయోజనాలతో లభిస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే నెలకు రూ.499 ధరతో, 40 Mbps వేగంతో BSNL అందించే నాణ్యమైన సేవలను అందించే ప్రత్యామ్నాయ ISP మరొకటి లేదు. పైన చెప్పినట్లుగా, Airtel కూడా తన 40 Mbps ప్లాన్‌ను అదే ధరకు అందిస్తుంది.

BSNL

అయితే మీరు ఇంత ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటే మరియు తక్కువ ఖర్చుతో తక్కువ స్పీడ్‌ని అందించే ప్లాన్‌తో స్థిరపడాలనుకుంటే, రూ.449 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వినియోగదారులకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. తేడా రూ.50 మాత్రమే కానీ, తక్కువ స్పీడ్ వస్తుంది. కానీ ఇక్కడ కూడా, రెండు ప్లాన్‌ల మధ్య ధర వ్యత్యాసం పెద్ద మొత్తంలో లేదని మీరు గమనించాలి. ఏదేమైనప్పటికీ.. BSNL అన్ని ప్రాంతాలలో తమ నెట్ వర్క్ ను కవర్ చేస్తుంది.

BSNL

అదేవిధంగా, BSNL నుంచి బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో 100 Mbps స్పీడ్ క‌లిగిన ప్లాన్ గురించి కూడా తెలుసుకుందాం:
భార‌త పబ్లిక్ టెలికాం ఆపరేటర్ అయిన BSNL యొక్క భారత్ ఫైబర్ కనెక్షన్ ద్వారా కొన్ని OTT సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇది నెలకు రూ.749కి, 100 Mbps ఇంటర్నెట్ ప్లాన్‌ను అందిస్తుంది. BSNL సూపర్‌స్టార్ ప్రీమియం-1 ప్లాన్ 100 Mbps ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తుంది. సూపర్‌స్టార్ ప్రీమియం-1 ప్లాన్ యొక్క FUP డేటా క్యాప్ 1000GB మరియు జాబితా చేయబడిన ధర GSTకి మినహాయించబడింది. 1000GB డేటా వినియోగించిన అనంత‌రం, ప్లాన్ 5 Mbps ఇంటర్నెట్ స్పీడ్‌ని అందిస్తుంది. మరియు Sony LIV ప్రీమియం, Zee5 ప్రీమియం మరియు ఇతరాలతో సహా ఎంపిక చేసిన OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్‌ను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
BSNL started news broadband plan with 40MBPS internet speed.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X