Just In
- 1 hr ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 3 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
- 19 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 22 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
Don't Miss
- News
తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ స్థానంలో వందే మెట్రో ..!!
- Movies
మీరా జాస్మిన్ రీ ఎంట్రీ పక్కా? హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే మళ్లీ.. రామ్ పోతినేని సినిమాలో అలా!
- Lifestyle
Green Comet 2023: ఆకాశంలో అద్భుతం, 50 వేల ఏళ్ల తర్వాత కనిపించనున్న తోకచుక్క
- Sports
INDvsAUS : ఎట్టకేలకు దక్కిన వీసా.. టెస్టు సిరీస్ కోసం భారత్‌కు ఖవాజా!
- Finance
Adani: పార్లమెంటుకు అదానీ పంచాయితీ.. విపక్షాల పట్టు.. మోదీ కాపాడతారా..?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సిమ్ లేకుండా కాల్ చేసుకోవడం ఎలా ?
దేశీయ టెలికాం రంగంలో వార్ వేడెక్కుతున్న నేపథ్యంలో టెల్కోలు కొత్త ప్లాన్ల మీద దృష్టిని సారించాయి. జియో రాకతో టెలికాం రంగం ఒక్కసారిగా కుదుపులకు లోనైన నేపథ్యంలో అన్ని టెల్కోలు తమ కస్టమర్లను చేజారిపోకుండా కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ దిగ్గజం BSNL అయితే కస్టమర్లను కాపాడుకునేందుకు భారీ ఆఫర్లను ప్రకటిస్తూ పోతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు సిమ్ లేకుండా కాల్ చేసుకునే సదుపాయాన్ని తీసుకువస్తోంది. వాట్సప్, మెసేంజర్ మాదిరిగానే ఈ ఫీచర్ ఉండబోతోంది.

వాట్సప్, మెసెంజర్ బాటలో ...
వాట్సప్, మెసెంజర్ బాటలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తన కస్టమర్లకు కొత్త ఆఫర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా BSNL దేశీయ తొలి టెలిఫోనీ సర్వీసును ఆవిష్కరించింది.

మొబైల్ యాప్ ద్వారా..
ఈ సర్వీసులతో తాను అందించే మొబైల్ యాప్ ద్వారా భారత్‌లో ఉన్న ఏ టెలిఫోన్ నెంబర్‌కైనా డయల్ చేసుకునేలా అవకాశం కల్పిస్తుంది. సిమ్ తో అవసరం లేకుండానే మీరు కాల్స్ చేసుకోవచ్చు.

BSNL ‘వింగ్స్’
ఈ ఫీచర్ కోసం BSNL ‘వింగ్స్' అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇక బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు కంపెనీ మొబైల్ యాప్ ‘వింగ్స్'ను వాడుతూ.. దేశంలో ఉన్న ఏ ఫోన్ నెంబర్‌కైనా కాల్స్ చేసుకోవచ్చు.

సిమ్ లేకుండా కాల్స్ చేసుకునేలా..
సిమ్ లేకుండా కాల్స్ చేసుకునేలా యూజర్లకు వీలుకల్పిస్తూ.. ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసులు తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్ మేనేజ్‌మెంట్‌కు కృతజ్ఞతలు' అని ఈ సర్వీసులను లాంచ్ చేసిన అనంతరం టెలికాం మంత్రి మనోజ్ సిన్హా అన్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు
ఈ సర్వీసులను వాడుతూ.. బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్ వై-ఫై లేదా మరే ఇతర సర్వీసు ప్రొవైడర్ ద్వారానైనా ఇతర నెట్‌వర్క్‌కు కాల్స్ చేసుకోవచ్చు.

యాప్ ఆధారిత కాలింగ్ సర్వీసు
వాలిడ్ టెలికాం లైసెన్స్ కలిగి ఉన్న టెలికాం కంపెనీలు వై-ఫై కనెక్షన్‌ను వాడుతూ యాప్ ఆధారిత కాలింగ్ సర్వీసు అందించవచ్చని గతంలోనే టెలికాం కమిషన్ అనుమతి ఇచ్చింది.

మామూలు కాల్స్ ఛార్జీలు
మామూలు కాల్స్‌కు ఏ మాదిరి ఛార్జీలు అమలవుతున్నాయో అవే ఛార్జీలను టెలికాం ఆపరేటర్లు విధించాలని కూడా ఆదేశించింది .

జూలై 25 నుంచి సర్వీసులు
ఈ వారం ప్రారంభంలో ఈ సర్వీసుల రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతాయి. జూలై 25 నుంచి ఈ సర్వీసులు యాక్టివేట్ అవుతాయి. మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్లకు అందించే డేటా ప్రయోజనాలను కూడా సమీక్షిస్తోంది.

రూ.444 ప్యాక్ అప్‌గ్రేడ్
తాజాగా రూ.444 ప్యాక్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ అప్‌గ్రేడ్ చేసింది. దీని కింద అంతకముందు రోజుకు 4 జీబీ డేటా లభిస్తే, ప్రస్తుతం రోజుకు 6 జీబీ డేటా అందివ్వనున్నట్టు తెలిపింది.

రోజుకు 6 జీబీ డేటా
రోజుకు 6 జీబీ డేటా మాత్రమే కాక, అపరిమిత ఆన్-నెట్ వాయిస్ కాల్స్‌ను కూడా 60రోజుల పాటు అందించనుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470