BSNL ఉచిత వై-ఫై సేవలు ప్రారంభం, హైదరాబాద్‌లో ఎక్కడెక్కడంటే..?
4జీ ప్లస్ వేగంతో ఇంటర్నెట్...
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL, హైదరాబాద్‌లోని 6 ప్రధాన లోకేషన్‌లలో ఉచిత వై-ఫై సేవలను ప్రారంభించింది. ఈ పబ్లిక్ వై-ఫైల వద్ద మొబైల్ యూజర్లకు 4జీ ప్లస్ వేగంతో ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.
Read More : రూ.5000కే జియో ల్యాప్‌టాప్

6 లొకేషన్స్ ఇవే...
ఎల్‌బీ నగర్‌లోని కామినేని హాస్పటల్స్‌తో పాటు కోటి, అబిడ్స్, జిల్లా ట్రెజరీ కార్యాలయం, అమీర్‌పేట్ ఇంకా గచ్చిబౌలి ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ ఉచిత వై-ఫై సేవలు అందుబాటులో ఉంటాయి.

రోజుకు 100ఎంబి ఇంటర్నెట్ ఉచితం..
ఈ వై-ఫై జోన్‌ల వద్ద రోజుకు 100ఎంబి ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది. లిమిట్ దాటిన తరువాత నుంచి బీఎస్ఎన్ఎల్ పబ్లిక్ వై-ఫై ప్లాన్‌కు సంబంధించిన డేటా వోచర్స్‌ను కొనుగోలు చేయటం ద్వారా వై-ఫై డేటాను పొందే వీలుంటుంది.

రూ.10 నుంచి రూ.599 వరకు వివిధ రేంజ్‌లలో...
ఈ డేటా వోచర్స్ రూ.10 నుంచి రూ.599 వరకు వివిధ రేంజ్‌లలో అందుబాటులో ఉంటాయి. ఈ కూపన్స్ వ్యాలిడిటీ 30 రోజుల వరకు ఉంటుంది. ఈ డేటా వోచర్‌లను సమీపంలోని కిరాణా స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.

బీఎస్ఎన్ఎల్ మొబైల్ యూజర్ అయినట్లయితే..
మీరు బీఎస్ఎన్ఎల్ మొబైల్ యూజర్ అయినట్లయితే ప్రత్యేకించి డేటా వోచర్లను కొనుగోలు చేయవల్సిన అవసరం ఉండదు. వై-ఫై డేటా యూసేజ్‌ను బట్టి నేరుగా మొబైల్ నెంబర్ అకౌంట్ నుంచే డబ్బులు కట్ అవుతాయి.


Click it and Unblock the Notifications








