BSNL STV 398 ప్లాన్ ప్రయోజనాలతో వెనక్కి తగ్గిన Jio, Airtel, Vi

|

ప్రభుత్వ టెల్కో బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా గల తన యొక్క వినియోగదారుల కోసం విలువ-ప్యాక్ ఒప్పందాలతో కొన్ని ఆసక్తికరమైన ఆఫర్లను అందిస్తున్నది. బిఎస్ఎన్ఎల్ నుండి లభించే అటువంటి వాల్యూ-ప్యాక్ STV398. స్వల్పకాలిక వాలిడిటీతో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా సంస్థలు అందించే 3GB రోజువారీ డేటా ప్లాన్‌తో పోల్చినప్పుడు బిఎస్‌ఎన్ఎల్ యొక్క కొత్త STV398 ప్లాన్ ఉత్తమమైనదిగా ఉంది. దీనికి గల కారణం గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL STV 398 ప్రయోజనాలు

BSNL STV 398 ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ యొక్క STV398 ప్లాన్ ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభించబడింది. ఈ ప్లాన్ వినియోగదారులకు ఎటువంటి (FUP) పరిమితి లేకుండా అపరిమిత డేటాను అందిస్తుంది. ఇంకా వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ముంబై, ఢిల్లీలోని రోమింగ్ మరియు ఎంటీఎన్ఎల్ నెట్‌వర్క్ ప్రాంతాలలో కూడా ఈ అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి. ఈ ప్లాన్ వినియోగదారులకు 30 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది.

ఇతర ఆపరేటర్ల 3GB డైలీ డేటా ప్లాన్స్ vs బిఎస్ఎన్ఎల్ STV398

ఇతర ఆపరేటర్ల 3GB డైలీ డేటా ప్లాన్స్ vs బిఎస్ఎన్ఎల్ STV398

రిలయన్స్ జియో 28 రోజుల వాలిడిటీతో 3GB రోజువారీ డేటాను కలిగిన ప్లాన్ ను వినియోగదారులకు రూ.349 ధర వద్ద అందిస్తుంది. భారతి ఎయిర్‌టెల్ కూడా అదే 3GB రోజువారీ డేటా ప్లాన్‌ను అదే 28 రోజుల వాలిడిటీతో రూ.398 ధర వద్ద అందిస్తుంది. అయితే బిఎస్‌ఎన్‌ఎల్ టెల్కో అదే రూ.398 ధర వద్ద ఎటువంటి పరిమితి లేకుండా అపరిమిత డేటాను అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్
 

పైన పేర్కొన్న వాటిలో బిఎస్ఎన్ఎల్ యొక్క STV 398 వోచర్ మాత్రమే 30 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. మిగిలిన అన్ని ఇతర వోచర్లు 28 రోజుల చెల్లుబాటును కలిగి ఉంటాయి. ఇంకా బిఎస్ఎన్ఎల్ తన ప్రణాళికను ఎయిర్టెల్ యొక్క ప్రణాళిక మాదిరిగానే అందిస్తుంది కాని డేటా విషయంలో ఎటువంటి FUP పరిమితులు లేవు. వాల్యూను పరిగణనలోకి తీసుకుంటే Vi యొక్క సమర్పణ కూడా అద్భుతమైనది. ఎందుకంటే ఇది చాలా చౌకైనది. కానీ వినియోగదారులకు అపరిమిత డేటాను అందించే విషయంలో BSNL యొక్క STV 398 ను ఎవరూ ఓడించలేరు.

Best Mobiles in India

English summary
BSNL STV 398 Plan Beats Jio, Airtel and Vi 3GB Daily Data Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X