Home
News

ప్రైవేట్ టెల్కోలకు పోటీగా రెట్టింపు డేటాతో BSNL ప్రీపెయిడ్ ప్లాన్లలో కొత్త సవరణలు...

భారత ప్రభుత్వ ఆద్వర్యంలోని టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు తన యొక్క మనుగడను పునరుద్ధరించడం కోసం దేశంలోని అన్ని ఆపరేటర్ల కంటే అత్యంత విలువైన ప్రీపెయిడ్ ప్రణాళికలను అందిస్తుంది. కొత్తగా వినియోగదారులను ఆకర్షించడానికి మరియు ఇప్పటికే ఉన్నవారిని నిలుపుకోవడం కోసం దాని పాత ప్లాన్ల యొక్క ప్రయోజనాలను సవరిస్తున్నది.

బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్ చెన్నై నుండి వచ్చిన సర్క్యులర్ ప్రకారం టెల్కో తన STV 499 మరియు STV 198 రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను సవరించింది. ఆపరేటర్ ఇప్పుడు STV 499 ప్లాన్ తో ఎక్కువ డేటాను అందిస్తున్నారు. అయితే STV 198 యొక్క ప్రయోజనాలను తగ్గించింది. ఈ రెండు ప్లాన్ల యొక్క సవరించిన ప్రయోజనాలను గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

BSNL STV 499 కొత్త సవరణలు

BSNL STV 499 కొత్త సవరణలు

BSNL STV 499 ప్లాన్ కొత్త సవరణలను అందుకున్న తరువాత ఇది వినియోగదారులకు 1GB రోజువారీ ఫెయిర్-యూజ్-పాలసీ (FUP) డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. వీటితో పాటు బిఎస్ఎన్ఎల్ ట్యూన్ బెనిఫిట్ మరియు జింగ్ బెనిఫిట్ వంటి ప్రయోజనాలను కూడా ఈ ప్లాన్ అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 90 రోజులు. రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, మరియు వొడాఫోన్ ఐడియా (Vi) యొక్క 84 రోజుల సమర్పణలతో పోటీ పడటానికి బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ యొక్క డేటా ప్రయోజనాలను సవరించింది.

 

 

1GB రోజువారీ డేటా

బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం ఈ ప్లాన్ లో చేసిన మార్పులలో భాగంగా డేటా ప్రయోజనాన్ని 1GB రోజువారీ డేటా నుండి 2GB రోజువారీ డేటాకు పెంచింది. మునుపటి మొత్తం 90GB కి బదులుగా వినియోగదారులు ఇప్పుడు 180GB మొత్తం డేటాను ఈ ప్లాన్‌తో పొందుతారు.

BSNL STV 198 కొత్త సవరణలు

BSNL STV 198 కొత్త సవరణలు

బిఎస్ఎన్ఎల్ టెల్కో ఇప్పుడు తన యొక్క STV 198 ప్లాన్ ను కూడా సవరణలను చేసింది. కానీ వింతైన విషయం ఏమిటంటే ఆపరేటర్ ప్లాన్ యొక్క ప్రయోజనాలను తగ్గించారు. ఇంతకుముందు వినియోగదారులకు 2GB రోజువారీ FUP డేటాను 54 రోజుల పాటు అందించే ఈ ప్లాన్ అదనంగా కాలర్ ట్యూన్ మార్చే అదనపు ప్రయోజనంను కూడా అందిస్తుంది.

STV 198 ప్లాన్

STV 198 ప్లాన్ యొక్క కొత్త సవరణల విషయానికి వస్తే ఇది వినియోగదారుల యొక్క చెల్లుబాటును 50 రోజులకు తగ్గించింది. అలాగే కాలర్ ట్యూన్ ప్రయోజనం లోక్‌ధన్ కంటెంట్‌తో భర్తీ చేయబడింది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ముందుమాదిరి అదే 2GB రోజువారీ డేటాను పొందుతారు. ఇది డేటా-ఓన్లీ వోచర్ అయినందున వినియోగదారులు ఈ ప్లాన్‌తో వాయిస్ కాలింగ్ లేదా SMS ప్రయోజనాలను పొందలేరు. గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి బిఎస్‌ఎన్‌ఎల్ టివి అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా లోక్‌ధన్ కంటెంట్‌ను యూజర్లు యాక్సెస్ చేయవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL STV Prepaid Plans Modified With Double Data to compete With Jio, Airtel and Vi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X