భారత దేశంలో మొట్ట మొదటి 'Made in India' 5G ని టెస్ట్ చేసిన BSNL ! లాంచ్ ఎప్పుడంటే?
భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 3.6 GHz మరియు 700 MHz స్పెక్ట్రమ్ బ్యాండ్‌లలో 'మేడ్ ఇన్ ఇండియా' స్వదేశీ 5G RAN (రేడియో యాక్సెస్ నెట్‌వర్క్) మరియు కోర్‌ని విజయవంతంగా పరీక్షించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ టెలికాం ఆపరేటర్ 2025 ప్రారంభంలో ఈ 5G ని లాంచ్ చేయాలని భావిస్తున్నారు.
భారత ప్రభుత్వ టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య ఎమ్ సింధియా మాట్లాడుతూ, "మేము 3.6 GHz మరియు 700 MHz బ్యాండ్‌లలో స్వదేశీ 5G RAN నెట్వర్క్ మరియు కోర్ యొక్క పరీక్షలను విజయవంతంగా నిర్వహించాము. మరియు భారతదేశం త్వరలో ఈ స్వదేశీ 5G సేవలను లాంచ్ చేయనున్నాము." అని వివరించారు.

ప్రస్తుతం BSNL లాంచ్ చేస్తున్న 4G సైట్‌లు 2025 లో 5G కి అప్‌గ్రేడ్ చేయబడతాయి. 2025 మధ్య నాటికి 1 లక్ష సైట్‌లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. భారత
దేశంలో స్వదేశీ 4G మరియు 5G నెట్వర్క్ లను లాంచ్ చేసే మొదటి ఆపరేటర్ BSNL అవుతుంది.
ఇప్పటివరకు, ప్రభుత్వ ఆధీనంలోని ఈ టెల్కో 39,000 4G సైట్‌లను లాంచ్ చేసింది. మిగిలినవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరిలోగానీ లేదా వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోగానీ పూర్తి చేయబడతాయి.
రిలయన్స్ జియో కాకుండా, ప్రీమియం 700 MHz బ్యాండ్‌కు ప్రాప్యత కలిగి ఉన్న దేశంలోని ఏకైక టెలికాం ఆపరేటర్ BSNL. ఇది విస్తృతమైన కవరేజీని అందించడానికి గొప్ప బ్యాండ్. అయితే, ధరల కారణంగా, ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi) బ్యాండ్‌లో పెట్టుబడి పెట్టడం మానుకున్నాయి.
BSNL యొక్క 4G సైట్‌లు ప్రస్తుతం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి. TRAI (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నివేదిక ప్రకారం, ప్రైవేట్ టెల్కోలు టారిఫ్ పెంపు జూలై 2024 తర్వాత, BSNL కొత్త కస్టమర్‌ల సంఖ్యలో పెరుగుదల ఉంది. ఇది ఇలాగే కొనసాగించడానికి, BSNL వీలైనంత త్వరగా కొత్త ప్రాంతాల్లో 4Gని అందుబాటులోకి తీసుకురావాలి.
BSNL ఇప్పట్లో మొబైల్ ప్లాన్‌ల టారిఫ్‌లను పెంచడం లేదని కంపెనీ సిఎండి రాబర్ట్ జె రవి కూడా ఇప్పటికే ధృవీకరించారు. ఇది కూడా BSNL కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది.
ఇటీవల, ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమం లో బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త లోగో విడుదల చేసింది. ఇంకా, ఈవెంట్ లో ఇతర 7 కీలక ఫీచర్‌ల విడుదల కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా BSNL లోగోను ఆవిష్కరించారు. మరియు స్పామ్ కాల్స్, SMS లకు చెక్ పెట్టడం సహా 7 కొత్త సర్వీసులను ప్రారంభించారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








