వెంటనే మీ పాస్ వర్డ్ మార్చేయండి.. BSNL హెచ్చరిక!

By: Madhavi Lagishetty

తమ బ్రాండ్ బ్యాండ్ కస్టమర్లు వెంటనే పాస్ వర్డ్ లు మార్చుకోవాలని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ కోరింది. మాల్వేర్ దాడిని ఎదుర్కొన్న తర్వాత..భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఈ హెచ్చరిక చేసింది.

వెంటనే మీ పాస్ వర్డ్ మార్చేయండి.. BSNL హెచ్చరిక!

పిటిఐ నివేదిక ప్రకారం దాదాపు 2వేల బ్రాడ్ బ్యాండ్ మోడమ్స్ పై మాల్ వేర్ ప్రభావం చూపించిందని..డిఫాల్ట్ పాస్ వర్డ్ అడ్మిన్ ను మార్చుకోకపోవడంతోనే ఈ దాడులు జరిగాయని కంపెనీ ప్రతినిధులు వివరించారు.

వినియోగదారులు తమ బ్రాండ్ బ్యాండ్ పాస్ వర్డ్ లను వెంటనే మార్చుకోవాలి. ఒక్కసారి పాస్ వర్డ్ ను మార్చితే ఇక ఎలాంటి సమస్య ఉండదని...తాము ఇచ్చిన సలహాను సద్వినియోగం చేసుకోవాలని బిఎస్ ఎన్ ఎల్ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు.

ఇక మాల్వేర్ దాడి బిఎస్ఎన్ఎల్ కోర్ నెట్ వర్క్ బిల్లింగ్ లేదా ఏ ఇతర వ్యవస్థణు ప్రభావితం చేయలేదని ఆయన చెప్పారు.

వీవో వీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ధర తగ్గింది!

మాల్వేర్ దాడి సమయంలో పాస్ వర్డ్ యూజర్లు (పాస్ వర్డ్స్ అడ్మిన్ గా ఉపయోగించుకున్నవారు) మారుతున్నట్లు, దీంతో ప్రభావితమైన మోడెములు లాగిన్ చేయలేకపోతున్నారని శ్రీవాస్తవ తెలిపారు.

ఈవారం మాల్వేర్ దాడి జరిగిందని...బిఎస్ఎన్ఎల్ కాల్ సెంటర్లను ముందుగానే వినియోగదారులను హెచ్చరించేందుకు జాగ్రత్తలు తీసుకుంటాన్నమని తెలిపారు. బిఎస్ఎన్ఎల్ కు సంబంధించిన బిల్లింగ్ కానీ ఏ ఇతర వ్యవస్ధను మాల్వేర్ దాడి ప్రభావితం చేయలేదని తెలిపారు. ఇది మొదటి సారి కాదని ఈ ఏడాది మేనెలలో కూడా మాల్వేర్ దాడిని ఎదుర్కొన్నట్లు తెలిపారు.

Read more about:
English summary
The company said that reports of a breach of "unverified and unsubstantiated claims".
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot