ఉచిత హాట్‌స్టార్ ప్రీమియంతో బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్
టెలికాం మరియు బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ గత రెండు సంవత్సరాలలో పెరిగిన పోటీ వలన ముఖ్యంగా బ్రాడ్‌బ్యాండ్ రంగంలో బిఎస్‌ఎన్‌ఎల్ నాలుగవ స్థానంలోకి పడిపోయింది.ఈ పోటీ ప్రపంచంలో బిఎస్‌ఎన్‌ఎల్ మళ్ళి తన స్థానాన్ని తిరిగి పొందడానికి చాలా రకాల ప్లాన్ లను అందిస్తోంది. ప్రపంచ కప్ సందర్బంగా బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందిస్తోంది.

ఈ కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల కింద వినియోగదారులకు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్ ప్రీమియంలో ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లతో సహా అన్ని రకాల వీడియోల కంటెంట్‌కు ఉచితంగా ప్రవేశం అందిస్తుందని బిఎస్‌ఎన్‌ఎల్ మరియు హాట్‌స్టార్ రెండు కంపెనీలు తెలిపాయి.

బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ బేస్:
బోనస్‌గా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో పాటు స్ట్రీమింగ్ సేవలను ఇవ్వడం ద్వారా బిఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్ బేస్ను విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని కేవలం రూ.999లకు అందిస్తోంది. దేశంలో ఇటువంటి సేవల వృద్ధిని పెంచాలనే లక్ష్యంతో భారత్ ఫైబర్ కస్టమర్లను ఎంపిక చేసుకోవడానికి బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు సూపర్ స్టార్ 300 అనే కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఇది కాంప్లిమెంటరీ హాట్‌స్టార్ ప్రీమియం చందాతో వస్తుంది.ఇది హాట్‌స్టార్ యొక్క పోర్ట్‌ఫోలియో, ఒరిజినల్స్, లైవ్ స్పోర్ట్స్, మూవీస్ మరియు టివి షోలకు యాక్సిస్ అందిస్తుంది.

సూపర్‌స్టార్ 300ప్లాన్ ధర మరియు ఆఫర్స్:
బిఎస్ఎన్ఎల్ ఫిక్స్‌డ్-లైన్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ సూపర్‌స్టార్ 300ప్లాన్ ను నెలకు 749 రూపాయలకు విడుదల చేసింది.ఈ ప్లాన్ సెకనుకు 50 మెగాబిట్‌తో 300 గిగాబైట్ డౌన్‌లోడ్‌లను ఆఫర్ చేస్తుంది. ఆ తర్వాత దాని ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్‌ను ఉపయోగించే వినియోగదారుల కోసం 2 ఎమ్‌బిపిఎస్ వద్ద అపరిమిత డేటాను అందిస్తుంది.

డేటా ఆఫర్స్:
ఈ ప్యాక్ హాట్‌స్టార్ ప్రీమియం యొక్క చందాతో 50 ఎమ్‌బిపిఎస్ వేగంతో 300 జిబి వరకు డౌన్‌లోడ్‌ను అందిస్తుంది. వినియోగదారులకు వారి సౌలభ్యం మేరకు క్రికెట్ ప్రపంచ కప్‌తో సహా నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ మరియు లైవ్ స్పోర్ట్స్ చూడటానికి మరియు మంచి కంటెంట్ తో ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తోంది అని బిఎస్ఎన్ఎల్ మరియు హాట్‌స్టార్ సంయుక్తంగా ఒక ప్రకటనలో చెప్పారు.
ఇప్పుడు ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఐసిసి ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్లను హాట్‌స్టార్ లో ప్లే చేయడానికి ప్రత్యేక హక్కులు హాట్‌స్టార్ కు ఉన్నాయి. నాన్-ఆప్టిక్ ఫైబర్ కనెక్షన్‌ను ఉపయోగించే బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు 10 ఎమ్‌బిపిఎస్ డౌన్‌లోడ్ వేగంతో 300 జిబి డేటా లభిస్తుంది మరియు దాని తరువాత 2 ఎమ్‌బిపిఎస్ వద్ద అపరిమిత సేవలు లభిస్తాయి.

అప్లై చేయడం ఎలా:
ఉచిత హాట్‌స్టార్ ప్రీమియం సభ్యత్వంతో కూడిన సూపర్ స్టార్ 300 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ దేశంలోని అన్ని టెలికాం సర్కిల్‌లలో లభిస్తుందని బిఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది.ఈ ఆఫర్ పొందటానికి ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో ద్వారా అప్లై చెయవచ్చు లేదా 18003451500 (టోల్ ఫ్రీ నంబర్) కు కాల్ చేయవచ్చు.

హాట్‌స్టార్ తో బిఎస్ఎన్ఎల్ భాగస్వామ్యం:
ఈ రోజు క్రికెట్ మ్యాచ్‌లను చాలా మంది మొబైల్స్, డెస్క్‌టాప్ మరియు స్మార్ట్ టివిలలో ఎక్కువ మంది చూస్తున్నారు.దీని కోసం చాలా మంది వినియోగదారులు అధిక డేటా వేగాన్ని కోరుకుంటారు. స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో హాట్‌స్టార్ ప్రీమియంతో బిఎస్ఎన్ఎల్ భాగస్వామ్యం ప్రారంభమైంది.ఈ మెగా స్పోర్ట్స్ సీజన్‌ను అద్భుతంగా జరుపుకునేందుకు సూపర్ స్టార్ 300ప్లాన్ తో వినియోగదారులకు ఉత్తమమైన ఆఫర్లను తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము అని బిఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ అన్నారు.
ఈ భాగస్వామ్యం రెండు కంపెనీలకు ఉత్తమమైనది. బిఎస్ఎన్ఎల్ యొక్క హై స్పీడ్ డేటా నెట్‌వర్క్ నుండి హాట్‌స్టార్ ప్రీమియం యొక్క లైవ్ గేమ్స్ మరియు టీవీ షోస్ లను ఉత్తమంగ చూడటానికి వీలు కల్పిస్తుంది అని హాట్‌స్టార్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ వరుణ్ నారంగ్ చెప్పారు.

మార్కెట్లో గట్టి పోటీ:
బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఉత్తమంగా అందించడానికి ప్రభుత్వ టెలికాం సంస్థ ఇప్పటికే వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లైన ఈరోస్ నౌ మరియు అమెజాన్ ప్రైమ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.బ్రాడ్‌బ్యాండ్ రంగంలో రిలయన్స్ జియో నుండి మార్కెట్లో గట్టి పోటీ ఉన్నప్పటికీ కొత్త కస్టమర్లను చేర్చుకుంటున్న ఏకైక టెలికాం ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్.


Click it and Unblock the Notifications








